Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : సీడబ్ల్యూసీ నిర్ణయం భేష్

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే, విభజన చట్టం ప్రకా

Advertiesment
komatireddy venkat reddy
, గురువారం, 2 ఆగస్టు 2018 (15:18 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే, విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. 
 
ఆయన బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురిసి, ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత సహా టీఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అందువల్ల ఏపీకి ప్రత్యేక ఇవ్వాల్సిందేనని ఆయన చెప్పారు. అలాగే, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేయాలని ఆయన కోరారు. 
 
తెలంగాణ వచ్చిన సంతోషం ఏ ఒక్కరిలో లేదని... కేవలం పాలకులు మాత్రమే ఆనందంగా ఉన్నారని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులకు తప్ప ఇతర మంత్రులకు కూడా అధికారాలు లేవని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాగితాలపై తప్ప, వాస్తవంగా లేదని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శంషాబాద్ విమానంలో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం