Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాక్షసుడి చేతిలో తెలంగాణ తల్లి బందీ: బీజేపీ

Advertiesment
Telangana
, ఆదివారం, 7 మార్చి 2021 (11:52 IST)
రాక్షసుడి చేతిలో తెలంగాణ తల్లి బందీగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఈ పాలన నుంచి రక్షించమని రాష్ట్రం ఘోషిస్తున్నదని, అందుకే బీజేపీ మలిదశ ఉద్యమం చేపట్టిందని చెప్పారు.

రాష్ట్రంలో కచ్చితంగా గెలిచే సీట్లలో కేసీఆర్‌ కుటుంబసభ్యులు పోటీలో ఉంటున్నారని, ఓడిపోయే సీట్లను ఇతరులకు కేటాయిస్తున్నారని విమర్శించారు. అధికార మత్తులో జోగుతున్న సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని వార్నింగ్‌లు ఇస్తున్నారని, బ్యాలెట్‌ వార్‌తో కేసీఆర్‌ నియంతృత్వ పోకడలను నిలువరించాలని పిలుపునిచ్చారు.

అధికారుల సంఘం అండదండలతో అందెలమెక్కిన మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ టీఆర్‌ఎ్‌సకు ఓటెయ్యకుంటే దేవుడు కూడా క్షమించడని అనడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
 
ఉద్యోగులు టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ వందలాది మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో నీళ్లు, నియామకాల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమాజాన్ని దారుణంగా వంచించిందని విమర్శించారు.

తెలంగాణ  ఉద్యమకారులు రోడ్డు పాలయ్యారని, ఉద్యమ ద్రోహులు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో బీజేపీకి 10 వేల ఓట్లు కూడా రావు