Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
బంగాళాఖాతంలో ఒడిశా, ఏపీ తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఉంది.
మరోవైపు ఛత్తీస్గఢ్ దక్షిణ ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల శుక్రవారం స్వల్పంగా వానలు పడ్డాయి.
నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 4 క్రస్టుగేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 1,22,376 క్యూసెక్కులుండగా, అవుట్ ఫ్లో 1,05,776 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలుండగా.. ప్రస్తుతం 310.8498 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. కాగా ప్రస్తుతం 589.60 అడుగులు ఉంది.