Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బికినీలో నా అందాలు ఇమడలేవంటున్న హీరోయిన్ ఎవరు? (Photos)

తన అందచందాలతో కుర్రకారు మదిలో తిష్టవేసిన హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. కోటేరులాంటి ముక్కు, తీరైన శరీరంతో చీర కట్టినా, మోడ్రన్‌ డ్రస్సు వేసినా ఈ మలయాళ కుట్టీ అందం అదరహో. ఈమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనే

Advertiesment
Anu Emmanuel
, శుక్రవారం, 7 జులై 2017 (14:36 IST)
తన అందచందాలతో కుర్రకారు మదిలో తిష్టవేసిన హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. కోటేరులాంటి ముక్కు, తీరైన శరీరంతో చీర కట్టినా, మోడ్రన్‌ డ్రస్సు వేసినా ఈ మలయాళ కుట్టీ అందం అదరహో. ఈమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలపై తన మనసులోని మాటను వెల్లడించారు.
 
సాధారణంగా సినిమాల్లో నటిస్తే డబ్బులిస్తారన్న విషయాన్ని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. అలాగని తాను పూర్తిగా డబ్బు మనిషినికాదని చెప్పారు. అందువల్ల తనకు వరుస ఆఫర్లు లేకపోయినా ఫర్వాలేదనీ, మంచి అవకాశాలు కావాలి, అందుకే సినిమాల ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకుంటాను అని చెప్పింది.
Anu Emmanuel
 
తనకు మాలీవుడ్‌లో కన్నా కోలీవుడ్‌, టాలీవుడ్‌లలోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో పవన్‌ కల్యాణ్‌‌తో ఓ చిత్రం చేస్తున్నాను. గోపీచంద్‌తో చేసిన ‘ఆక్సిజన్‌’ విడుదల ఆలస్యం అవుతోంది. ఇవికాకుండా మరో రెండు కథలకు ఓకే చెప్పినట్టు తెలిపారు.
Anu Emmanuel
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్‌ కల్యాణ్‌, మహేష్‌బాబులంటే విపరీతమైన ఇష్టమని చెప్పారు. చిన్నతనం నుంచీ వారి సినిమాలు బాగా చూసేదాన్ని. ఇద్దరిలో పవన్‌ స్టైల్‌ చాలా బాగుంటుంది. ఆయనతో నటించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. అలాగే మహేష్‌బాబుతో కూడా నటించే అవకాశం వస్తే బాగుండును అనిపిస్తూ ఉంటుంది.
Anu Emmanuel
 
సినిమాల్లోనే కాకుండా, నిజ జీవితంలోనూ అందం పేరుతో అరకొరా డ్రస్సులు వేసుకోవడానికి తాను పూర్తి వ్యతిరేకిని. మనం ఎలాంటి డ్రస్సులు వేసుకన్నా ముఖంలో చిరునవ్వు చెరగకుండా ఉంటే దానికి మించిన అందం మరొకటి ఉండద కదా. ఇకపోతే.. బికినీలు నా శరీరానికి సరిపోవు. పైగా నా అందాలు అందులో ఇమడలేవు. అందుకే ఇప్పుడే కాదు ఎప్పుడూ బికినీ వేసుకోవడానికి ప్రయత్నించను. ఇక లిప్‌లాక్‌లంటే ఇప్పటివరకూ అలా ఎవరూ నన్ను అడగలేదు. అడిగినప్పుడు దానిగురించి ఆలోచిస్తాను.
Anu Emmanuel

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవా వేదికగా సామ్ - చై వివాహం... న్యూయార్క్‌లో హనీమూన్!