Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్మీకి జబర్దస్త్ ఆఫర్ వచ్చినట్టే: మారుతీ సినిమాలో హీరోయిన్‌గా?

బుల్లితెర నుంచి వెండితెరపై గుంటూరు టాకీస్ ద్వారా మెరిసిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ షోను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోనని క్లారిటీ ఇచ్చింది. తాజాగా రష్మీకి అవకాశాలు రాకపోవడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వ

Advertiesment
Director maruthi bumper offer to anchor rashmi gautam
, ఆదివారం, 16 అక్టోబరు 2016 (10:40 IST)
బుల్లితెర నుంచి వెండితెరపై గుంటూరు టాకీస్ ద్వారా మెరిసిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ షోను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోనని క్లారిటీ ఇచ్చింది. తాజాగా రష్మీకి అవకాశాలు రాకపోవడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందని టాక్. తాజాగా డైరెక్టర్ మారుతి తన నెక్స్ట్ మూవీలో రష్మికి హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చాడట. నానితో 'భలే భలే మగాడివోయ్', వెంకీతో 'బాబు బంగారం' చెయ్యకముందు మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' లాంటి యూత్ కంటెంట్ వున్న మూవీస్ తీసి హిట్ కొట్టాడు.
 
ఇప్పుడు మళ్ళీ అలాంటి యూత్ కంటెంట్ వున్న ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ మూవీలో రష్మిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నాడట. అదే నిజం అయితే.. సరైన ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న రష్మికి జబర్దస్త్ ఆఫర్ వచ్చినట్టే. అయితే ఈ మూవీని మారుతి సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కానీ దర్శకత్వం మారుతి వహిస్తాడా లేదా అనేది తెలియాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు, మురుగదాస్ సినిమా టైటిల్ అదేనా? దీపావళికి ఫస్ట్ లుక్