Publish Date: Tue, 02 Jun 2026 (16:18 IST)
Updated Date: Tue, 02 Jun 2026 (16:22 IST)
తమిళనాడు సీఎం విజయ్, ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సపోర్టర్స్ వేధింపుల వల్లే తనకు గర్భస్రావం అయిందని బిగ్‌బాస్ కంటెస్టెంట్, మాజీ నర్సు, నటి మరియా జూలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీవీకే సపోర్టర్స్ తనను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని నటి జూలీ అన్నారు. దీనివల్ల తాను మానసికంగా కుంగిపోయానని, గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఈ వేధింపులు కొనసాగడంతో తీవ్ర ఒత్తిడికి గురై గర్భస్రావం అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు గర్భస్రావం కావడానికి, తన బిడ్డను కోల్పోవడానికి సీఎం విజయ్ కారణమని ఆరోపించారు. ఈ విషయంలో గత మార్చిలో 8 మందిపై ఫిర్యాదు చేసినట్లు కూడా ఆమె చెప్పారు. తన భర్తను కూడా రూ.15 లక్షల కిడ్నీ స్కామ్‌లో ఆయనను ఇరికించారని అన్నారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ కేసులో తనకు నోటీసులు పంపి వేధిస్తున్నారని, దీని వెనుక టీవీకే వ్యక్తి, ఓ లాయర్ ఉన్నారని ఆమె ఆరోపించారు.