Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశ్వంభరలో మీనాక్షి చౌదరి నటిస్తోందా?

Advertiesment
Meenakshi Choudhary

సెల్వి

, బుధవారం, 30 అక్టోబరు 2024 (10:33 IST)
మీనాక్షి చౌదరి ఈ ఏడాది గుంటూరు కారంలో చాలా చిన్న రోల్ చేసింది. తాజాగా నటి లక్కీ భాస్కర్‌లో ఆమె నటించింది. ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఆశాజనకంగా వుండటంతో ఆమెకు ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.  
 
దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ఈ మూవీలో నటనకి అవకాశం ఉన్న పాత్రలో కనపడబోతుంది. ట్రైలర్‌లో ఈ విషయం చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. విశ్వక్ సేన్, వరుణ్ తేజ్‌ల అప్ కమింగ్ మూవీస్ మెకానిక్ రాఖి, మట్కాల్లోనూ మీనాక్షి చేయనుంది. 
 
విశ్వంభరలో మీనాక్షి కూడా చెయ్యబోతుందని, అది కూడా ఒక  అద్భుతమైన పాత్రలో కనిపించబోతుందనే వార్తలు కొన్ని రోజుల నుంచి సినీ సర్కిల్స్‌లో వినిపిస్తూ ఉన్నాయి. 
 
ఇప్పుడు ఆ వార్తలపై మీనాక్షి వివరణ ఇచ్చింది. "నేను  విశ్వంభరలో చేయడంలేదు. అలాంటిది నేను చేస్తున్నట్టుగా వార్తలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే  స్వయంగా ప్రకటిస్తానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.
 
విశ్వంభరలో త్రిషతో పాటు అషికా రంగనాథ్‌లు హీరోయిన్లుగా చేస్తున్న విషయం తెలిసిందే. మరి కొంత మంది హీరోయిన్లు కూడా చెయ్యబోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క సినిమా మా ఆయన కోసం చూడమంటున్న రహస్య గోరక్ (video)