Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్-పవన్ కల్యాణ్- చెర్రీ వీడియో వైరల్.. (video)

Advertiesment
Ramcharan_pawan

సెల్వి

, సోమవారం, 6 జనవరి 2025 (10:34 IST)
Ramcharan_pawan
సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రొడక్షన్ టీం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. 
 
ఈ నేపథ్యంలో శనివారం రాజమండ్రిలో గ్రాండ్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేలాదిగా అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ హాజరుకావడం విశేషం. ఆయన పాల్గొనడం మెగా ఈవెంట్‌కు ప్రత్యేక శోభను చేకూర్చింది. 
 
ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తర్వాత, రామ్ చరణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా బాబాయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్‌కు హాజరైనందుకు,ఎల్లప్పుడూ తన పక్కన నిలబడినందుకు పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్‌తో పాటు ఫోటోలు కూడా జత చేశారు. ఇవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు అభిమానుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. 
 
మరోవైపు గేమ్ చేంజర్ ఈవెంట్‌కు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈవెంట్ నుంచి బయల్దేర సమయంలో పవన్ చేతిలో చెర్రీని ఆగు ఆగు అంటూ సైగ చేస్తున్నారు. రెండుసార్లు లేచి కదిలేందుకు సిద్ధమైన రామ్ చరణ్‌ను ఉండమన్నట్లు చేతితో సైగ చేసి.. ఆపై పోలీసులకు సెక్యూరిటీని కరెక్ట్ గా వుందా అనే రీతిలో సైగ చేశారు. ఆపై చెర్రీని తీసుకుని అక్కడ నుంచి కదిలారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుట్లో ఐడియాలజీ అర్థం కాలేదు, ఆ సినిమా చేశాక ఇండియన్ 2లో ఛాన్స్ : ఎస్ జే సూర్య