Publish Date: Fri, 23 Oct 2026 (13:05 IST)
Updated Date: Fri, 23 Oct 2026 (13:11 IST)
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం కొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారా? దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న #RC17 కోసం చరణ్ జుట్టు పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన పొనీటెయిల్‌తో కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో చరణ్ తన సహజసిద్ధమైన, రఫ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక మగధీర లో యోధుడిగా, ధృవ లో స్టైలిష్ పోలీస్ అధికారిగా, ఇటీవల పెద్ది లో గడ్డం, పొడవాటి జుట్టుతో కనిపించి తన పాత్రలకు తగ్గట్టుగా రూపాన్ని మార్చుకోవడంలో ఆయన ప్రత్యేకత చాటుకున్నారు.
ఇప్పుడు RC17 కోసం సుకుమార్ ఎలాంటి లుక్‌ను ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ప్రారంభోత్సవం త్వరలో జరగనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సారా అర్జున్ కథానాయికగా నటించే అవకాశముందని, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
RC17 పట్టణ నేపథ్యంలో రూపొందనున్నట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. మరి రామ్ చరణ్-సుకుమార్ కలయిక ఈసారి ఎలాంటి విభిన్నమైన రూపంతో, కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి!
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More