Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాంగోపాల్ వర్మ నెక్ట్స్ టార్గెట్ ఉదయ్ కిరణ్ బయోపిక్, కారణం అదే..!

Advertiesment
Ramgopal Varma Next Target Uday Kiran Biopic
, శనివారం, 25 జులై 2020 (13:12 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం పవర్ స్టార్. ఈ మూవీ ట్రైలర్‍కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఇక సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. అయితే... వర్మ ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పుడు ఎవరూ కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. మెగా హీరోలు ఎవరూ స్పందించలేదు.
 
అభిమానులు కూడా సీరియస్‌గా తీసుకోకపోవడంతో పవర్ స్టార్ పైన క్యూరియాసిటీ అంతగా లేదనిపించింది. అయితే... విడుదల తేదీ దగ్గరపడిన రెండు రోజులకు వర్మ ఆఫీస్ పైన పవన్ అభిమానులు దాడి చేయడంతో పవర్ స్టార్ వార్తల్లో నిలిచింది. వివాదస్పదం అయ్యింది.
 
 వర్మకు కావాల్సింది ఇదే. పబ్లిసిటీ వచ్చేసింది. ఈ సినిమాకి కౌంటర్‌గా పరాన్నజీవి అంటూ మరో సినిమా వస్తుండటం తదితర కారణాలతో వర్మ ఆశించిన బజ్ వచ్చేసింది.
 
ఇక ఈ సినిమా తర్వాత ఏ సినిమా తీయనున్నాడు అంటే... ఉదయ్ కిరణ్ బయోపిక్ అని తెలిసింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఈ సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్‌ బయోపిక్ అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత తేజ కాదు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ రానుందని టాక్ వచ్చింది. ఈ రెండు జరగలేదు.
 
ఇప్పుడు వర్మ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయాలనుకున్నాడట. కారణం ఏంటంటే... ఉదయ్ కిరణ్‌‌కి చిరు డాటర్‌తో నిశ్చితార్ధం కావడం... ఆ తర్వాత క్యాన్సిల్ అవ్వడం.. ఆ తర్వాత చిరు వలనే అవకాశాలు లేకుండాపోయాయి అని ప్రచారం జరిగింది. ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తే... చిరు ఫ్యామిలీని మరోసారి టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుందనే వర్మ ఉదయ్ కిరణ్ బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు వెండితెర‌కు బంగారు న‌ట‌నా నిధి కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, బర్త్ డే స్పెషల్ ఆర్టికల్