Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాయిపల్లవి అంత డిమాండ్ చేస్తుందా? నిర్మాతలు పారిపోతున్నారట.. నిజమా?

సాయి పల్లవి ఎవరో తెలుసుకదా.. ప్రేమమ్ మలయాళ చిత్రంలో మలర్‌గా టీచర్ పాత్రలో అలరించిన సాయిపల్లవి అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ కావడంతో సాయిపల్లవికి కోలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రఖ్యాత ద

Advertiesment
Sai Pallavi Scares Film Producers
, గురువారం, 8 డిశెంబరు 2016 (13:20 IST)
సాయి పల్లవి ఎవరో తెలుసుకదా.. ప్రేమమ్ మలయాళ చిత్రంలో మలర్‌గా టీచర్ పాత్రలో అలరించిన సాయిపల్లవి అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ కావడంతో సాయిపల్లవికి కోలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కార్తీకి జంటగా కాట్రు వెలియిడై చిత్రంలో నటించే అవకాశాన్ని ఆ పాత్ర గ్లామరస్‌గా ఉందని సాయి పల్లవి తోసిపుచ్చింది. 
 
తాజాగా సియాన్ విక్రమ్, హాస్య కథానాయకుడు సంతానంలతో నటించే అవకాశాలను దర్శక నిర్మాతలను బెదరగొట్టే షరతులతో వదులుకున్నారు. ఇప్పటివరకూ ఒక్క తమిళ సినిమాలోనూ నటించని సాయిపల్లవి భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో అమ్మడును చూస్తే నిర్మాతలు పారిపోతున్నారు. సాయిపల్లవి రూ.50లక్షలు డిమాండ్ చేయడంతో.. ఆమె కాల్షీట్స్ ఏమొద్దని వెళ్ళిపోతున్నారు. 
 
తాజాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానంకు జంటగా సాయిపల్లవిని నటింపచేయాలనుకున్న నిర్మాత ఇప్పుడు నటి అదితిని ఎంపిక చేసుకున్నారు. ఇలా సాయిపల్లవి అంటేనే నిర్మాతలు పక్కనబెట్టేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్ నా లక్కీ నెం.9 అన్నారు కానీ నాకు నమ్మకం లేదు... రాంచరణ్ ఇంటర్వ్యూ