Publish Date: Fri, 18 Sep 2026 (14:46 IST)
Updated Date: Fri, 18 Sep 2026 (14:50 IST)
తొలి వలపు, గౌరి, హనుమాన్ జంక్షన్, శ్రీ రామదాసు వంటి తెలుగు చిత్రాలలో నటించిన నటి స్నేహ, కాకా సినిమాతో టాలీవుడ్‌లోకి తిరిగి వస్తున్నారు. చిరంజీవి గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న ఈ భారీ చిత్రంలో స్నేహ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఘనంగా విడుదల కానుంది. ఈ సినిమాలో స్నేహ చిరంజీవి భార్య పాత్రలో కనిపించనున్నారని సమాచారం. చిత్ర బృందం త్వరలోనే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది.
చిరంజీవితో కలిసి నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న స్నేహకు ఇది నిజంగా ఒక కల సాకారం కానుంది. ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె అమ్ములు పాప పాత్రను అనస్వార రాజన్ పోషిస్తున్నారు.
నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన లభించింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More