Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

Advertiesment
Dance queen Sreelela

దేవీ

, గురువారం, 8 మే 2025 (11:44 IST)
Dance queen Sreelela
శ్రీలీల ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో సినిమాలతోపాటు బాలీవుడ్ లోకి ప్రవేశించింది. కార్తీక్ ఆర్యన్ సరసన నటించనుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాతో బాలీవుడ్‌లో కూడా సంచలనం సృష్టిస్తోంది. కారణం కార్తీక్ ఆర్యన్ తో నటించడం వల్లే ఈ క్రేజ్ వుంది. శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ డేటింగ్ గురించి కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. దానితో వీరి కాంబినేషన్ హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల ఈ సినిమా కాకుండా మరో సినిమాలో కూడా నటించనున్నట్లు బాలీవుడ్ కథనాలు తెలుపుతున్నాయి.
 
కరణ్ జోహార్ గతంలో దోస్తానా 2ని ప్రకటించాడు, లక్ష్యను ప్రధాన పాత్రలో తీసుకున్నాడు. కరణ్ మొదట లక్ష్యను ఈ చిత్రంలో పరిచయం చేయాలని అనుకున్నప్పటికీ, గత సంవత్సరం నేరుగా OTTలో విడుదలైన కిల్‌తో అరంగేట్రం చేసింది.
 
మొదట కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ ఈ సీక్వెల్‌ లో నటిస్తారని తెలిపారు. అయితే, ఇప్పుడు జాన్వీ కపూర్ స్థానంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందని వర్గాలు వెల్లడిస్తున్నాయి. శ్రీలీల ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్‌తో అనురాగ్ బసు పేరులేని సంగీత చిత్రంలో నటిస్తోంది. పుష్ప 2లో ఆమె ప్రత్యేక పాట బాలీవుడ్ వర్గాల్లో ఆకర్షణను పొందింది, ఇది ఆమె చిత్రనిర్మాతలలో గుర్తింపు పొందడానికి సహాయపడింది. ఆ బజ్ ఆమెను ఇప్పుడు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న దోస్తానా 2 కోసం సెట్ అయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు