Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

Advertiesment
FDC chaiman Dil Raju

డీవీ

, శనివారం, 21 డిశెంబరు 2024 (10:28 IST)
FDC chaiman Dil Raju
తెలుగు రాష్ట్రం రెండు ముక్కలుగా ఏర్పడి ఆంధ్ర, తెలంగాణగా విడిపోయి సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, నాయకులు ఆంధ్రవాళ్ళు తెలంగాణ కళాకారులను నొక్కేశారని స్టేట్ మెంట్లు పలు సందర్భాల్లో ఇచ్చారు. అప్పట్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాద్ లోని రామానాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోలను ప్రభుత్వ పెద్దలు సందర్శించారు.

అప్పట్లో చెకచెకా తెలంగాణ సినిమాలు ప్రారంభోత్సవాలు జరిగాయి. రామానాయుడు స్టూడియోలో తెలంగాణకు చెందిన సినిమా ప్రారంభోత్సవంలో ప్రముఖ మంత్రులు హాజరయ్యారు. వారు రావడంతోనే తన అనుచరులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.. అసలు మా భూమిలో మీ స్టూడియోలు ఏమిటి? అబ్బ కొండంతా దోచేశారు? ఇది మాకే దక్కాలి అన్నట్లు నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి  పెద్దలు వారించడంతో శాంతపడ్డారు. 
 
అదే విధంగా ఫిలిం కల్చరల్ క్లబ్ లో కూడా ఇదేనినాదాలు చేశారు. అప్పుడు కోదండరామ్ వంటివారుకూడా అక్కడ జరిగిన ఫంక్షన్ కు వచ్చారు. మంత్రులు సరేసరే. అది కూడా తమదే అంటూ నినాదాలు చేశారు. ఆ సభలోనూ పలు సందర్భాల్లోనూ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో పూణే ఫిలింఇనిస్టిట్యూట్ త‌ర‌హా  ఫిలింఇనిస్టిట్యూట్ ని కూడా నెల‌కొల్పాల‌ని తెరాస పెద్ద‌లు నొక్కి చెప్పారు. అక్కడి తెలంగాణ వారంతా జై తెలంగాణ.. మా నాయకుడికి జైఅంటూ తెగ సంబరాలు చేశారు. కానీ  ఆ సంబరం ఇప్పడు ఏమయింది? వారంతా ఏమయ్యారు? ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ సినిమా అభివ్రుద్ధికి ఎటువంటి ప్ర‌య‌త్న‌మే క‌నిపించ‌లేదు.
 
అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎప్పుడూ సినిమా పరిశ్రమ అభివ్రుద్ధి గురించి ఆలోచించలేదు. అంతకంటే ప్రజాసమస్యలు అంటూ వివిధ అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అంతకుముందే చిగురించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు ఒక్కసారిగా ఊపు వచ్చింది. మా కార్మికులు, మా షూటింగ్, మా నటీనటులు, సాంకేతిక సిబ్బంది అంటూ ఆర్.కె.గౌడ్ లాంటివారు తెలంగాణ నిర్మాతలకు, కార్మికులకు భరోసా ఇచ్చారు. కానీ నేటికీ పెద్దగా లాభించింది లేదు. 

 అప్పటినుంచి కొద్దికాలం ఎఫ్.డి.సి. ఛైర్మన్ పోస్ట్ ఖాళీగా వుంది .ఆ తర్వాత ఎఫ్.డి.సి.లో అందరూ తెలంగాణ వారే వుండాలని రూల్ కూడా పెట్టుకున్నారు. కొంతకాలం తర్వాత తెలంగాణలో పంపిణీదారుడు, నిర్మాత అయిన రామ్మోహన్ రావును ఛైర్మన్ గా నియమిస్తూ కె.సి.ఆర్. ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటినుంచి ఆయన తెలంగాణ సినిమా అభివ్రుద్ధిని చేస్తానని ప్రకటించారు. అలా పదేళ్ళుపూర్తయ్యాయి. కానీ చాలా సమస్యలు అలానే వుండిపోయాయి. ఇప్పుడు మరో నిర్మాత ఆ పోస్ట్ కు వచ్చారు.
 
ఇక తెలంగాణాలో పేరెన్నిగన్న దిల్ రాజు కూడా పెద్ద నిర్మాత. అప్పట్లోనే ప్రభుత్వ పెద్దలు ఆయనతో సినిమారంగంగురించి మంచీ చెడులు వాకబు చేసేవారు. ఆయన ఆధ్వర్యంలో ఓ కమిటీకూడా వుంది. దాంతో ఆయన వల్ల మనకు చాలా లాభం వుంటుందని కార్మికులు అనుకున్నారు. దిల్ రాజువంటి వారు సినిమాలు తీస్తే అంతా మన తెలంగాణ వారినే పెడతారని భావించారు. కానీ ఆయన తీసిన సినిమాల్లోనూ ఆంధ్రవారినే ఎక్కువగా పెడుతుంటారు. తెలంగాణ నేపథ్యంతో రూపొందిన బలగం సినిమాలోనూ కీలక పాత్ర ఆంద్రవారే పోషించారు. ఇదంతా వ్యాపారం ఇక్కడ వేరు చేయడం కుదరదు అన్న సందర్భాలున్నాయి కూడా. మరి అలాంటి వ్యాపార వేత్త ఇప్పుడు ఫిలిం డెవలప్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ఆయనముందున్నాయి. 
 
ఎప్పటినుంచో తిరస్కారానికి గురయిన ఇంటర్నేషనల్ పిలింఫెస్టివల్, పూనా ఫిలిం ఇన్ స్టిట్యూట్ తరహా శిక్షణా సంస్థ, చిన్న సినిమాలకు రాయితీలు, కార్మికుల వేతనం పెరుగుదల, పారితోషికాల్లో మధ్యవర్తుల చేతివాటం, ఇంకా సినీరంగంలో పలు సమస్యలతోపాటు ఎగ్జిబిటర్ల సమస్యలు చాలా వున్నాయి. ఇవన్నీ ఆయన ఆధ్వర్యంలో సాల్వ్ అవుతాయని సినీరంగ పెద్దలు భావిస్తున్నారు.
 
ఇవన్నీ నెరవేరాలంటే తెలంగాణనుంచి భారీగా నిర్మాతలు రావాల్సిన అవసరం వుంది. సాంకేతిక సిబ్బంది రావాలి. నటీనటులు ఎలాగూ వున్నారు. వారికి సరైన బాటను వేసేదిశగా ఇప్పటి ప్రభుత్వం కూడా నడుం కట్టాలి. దానికి వారధిగా ఎఫ్.డి.సి. వుండాలి. రాజకీయఅంశాలుకంటే సినిమా అంశాలనేవి కాస్త చులకనగా చూసే ప్రభుత్వాలు నడుస్తున్న కాలం ఇది. మరి తెలంగాణాలో సినిమా అభివ్రుద్ధి అవుతుందా? లేదా? కాలమే నిర్ణయించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?