Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26 ఏళ్ల క్రితం ఏ(A) చిత్రం టైంలో ఉన్న ఉత్సాహం ఇప్పటికీ ఉంది : హీరో ఉపేంద్ర

Advertiesment
Hero Upendra

డీవీ

, శనివారం, 15 జూన్ 2024 (18:47 IST)
Hero Upendra
ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ఏ(A) చిత్రం తెలుగులో 4కేలో గ్రాండ్‌ రీరిలీజ్‌కు ముస్తాబు అవుతుంది. జూన్ 21వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ చేస్తున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు నిర్మాతలు. ఈ వేడుకలో చిత్ర హీరో ఉపేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 
 
Hero Upendra
Upendra, Saidulu Lingam Yadav
హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని అప్పడు ఆదరించిన ప్రేక్షకులకు, ఇప్పడు రీరిలీజ్ సైతం ఆదరించాడానికి సిద్ధంగా ఉన్న నవతరం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన సినిమాలను ప్రేక్షకులకు చేరవేసిన మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఏ సినిమా తన జీవితంలో మరిపోలేనిది అని.. 26 సంవత్సరాల క్రితం ఈ చిత్రం విడుదల అవుతున్న సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఇప్పటి ప్రేక్షకులు షాక్ అవుతారని చెప్పారు. కచ్చితంగా జూన్ 21న థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అని పేర్కొన్నారు. 
 
కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఏ(A) బుద్దిమంతులకు మాత్రమే అనేది శీర్షిక. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన చాందినీ నటించారు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం కన్నడలో 1998లోనే 20 కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అంతటి కల్ట్ ఫిల్మ్ జూన్ 21 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని సినిమా ప్రీయులు, ఉపేంద్ర ఫ్యాన్స్ తెగ సంబరం చేసుకుంటున్నారు.

చందు ఎంటర్ టైన్మెంట్ స్థాపకులు లింగం యాదవ్ మాట్లాడుతూ.. ముందుగా రీరిలీజ్ చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఛత్రపతి, యోగి లాంటి బ్లాక్ బస్టర్ మూవీలను రీరిలీజ్ చేశామని, ఈ సందర్భంగా ఉపేంద్ర నటించిన ఏ సినిమాను సైతం రీరిలీజ్ చేయాలనే సంకల్పం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ఏ చిత్రం అంటే తనకు ఎప్పటి నుంచో చాలా ఇష్టమని లింగం యాదవ్ వెల్లడించారు. మూవీ కోసం బెంగళూరు వెళ్లి హీరో ఉపేంద్రను కలిసినప్పుడు ఆయన స్పందించిన తీరు అభిమాని అయిపోయానని చెప్పారు. అడిగిన వెంటనే దేవుడిలా వరం ఇచ్చారని ఉపేంద్ర గొప్పతనాన్ని కొనియాడారు. ఇక ఏ చిత్రాన్ని జూన్ 21 థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అని పేర్కొన్నారు. 
 
నిర్మాత సైదులు మాట్లాడుతూ.. లింగం యాదవ్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు వెంటనే హీరో ఉపేంద్రను కలువడానిక బెంగళూరు వెళ్లి అన్ని రైట్స్ తీసుకున్నామని తెలిపారు. అడిగిన వెంటనే ఆయన స్పందించిన తీరు చూసి ఆశ్చర్యం వేసిందని ఆయన మంచితనం ఏంటో ఆరోజు తెలిసిందని నిర్మాత సైదులు చెప్పారు. ఈ సినిమా కోసం ఒక బైట్ ఇవ్వండి సర్ అంటే ఏకంగా హైదరాబాద్‌కే వచ్చి స్వయంగా మాట్లాడుతా అని చెప్పడం ఆశ్యర్యం వేసిందని అన్నారు. జూన్ 21 విడుదల కాబోతున్న ఏ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరోం హర వంటి.మంచి సినిమా తీశామని అభినందించడం ఆనందంగా వుంది: ప్రొడ్యూసర్స్ సుబ్రహ్మణ్యం, సుమంత్