Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు

Advertiesment
Bellamkonda Srinivas, Manchu Manoj, Nara Rohit,

దేవీ

, సోమవారం, 12 మే 2025 (09:19 IST)
Bellamkonda Srinivas, Manchu Manoj, Nara Rohit,
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఈ సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. డుమ్ డుమారే.. పాట కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు, నిజమైన ఫ్రెండ్షిప్ ని సెలబ్రేట్ చేసుకునే ఓ వేడుక. ఇది బిగ్ స్క్రీన్ పై మరింత ఇంపాక్ట్ ఫుల్ గా వుండబోతోంది. 
 
విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది, విడుదలైన తొలి రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.
 
తాజాగా మేకర్స్ మూడవ సింగిల్ 'డుమ్ డుమారే' ని విడుదల చేశారు, ఇది స్నేహానికి అంకితంగా ఉన్న ఒక వైబ్రెంట్ సాంగ్. కలర్ ఫుల్ కార్నివల్ నేపథ్యాన్ని కళ్లకు కట్టించిన ఈ సాంగ్, చిత్రంలో ముగ్గురు హీరోల మధ్య ఉన్న స్నేహాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల లైవ్లీ బీట్‌లతో కూడిన సంగీతాన్ని అందించగా, మధురమైన ఇంటర్ల్యూడ్ తో భావోద్వేగాన్ని మేళవించారు.
 
లిరిక్ రైటర్ భాస్కరభట్ల స్నేహం యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా రాయగా, గాయకులు రేవంత్, సాహితి చాగంటి తమ పవర్ ఫుల్ వోకల్స్ తో ఆలపించారు. గణేష్ మాస్టర్ కోరియోగ్రఫీ ఆకట్టుకునే విధంగా వుంది. బెల్లంకొండ శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, స్నేహబంధం, పాటని మరింత అద్భుతంగా మార్చింది. 
 
ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మ కడాలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్ రైటర్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు