Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం.. అదే పతనానికి కారణం : అమీర్ ఖాన్

Advertiesment
aamir khan

ఠాగూర్

, గురువారం, 13 మార్చి 2025 (11:59 IST)
సినిమాను ఎక్కడినుంచైనా చూడొచ్చనే బిజినెస్ మోడల్‌తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నామని, అదే బాలీవుడ్ సినిమా పతనానికి కారణమైందని అగ్రనటుడు అమీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఓటీటీలు లేనపుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేవారని, ఇపుడు సినిమాలు నచ్చితే మినహా థియేటర్లకు రావడం లేదని, దయచేసి ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలని ఆయన ప్రాధేయపడ్డారు. 
 
గత కొంతకాలంగా బాలీవుడ్ చిత్రపరిశ్రమ పతనమవుతుంది. మరోవైపు, దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దూసుకునిపోతున్నాయి. బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. బాలీవుడ్ ఇలాకావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు. 
 
ఉత్తరాది సినిమానా?... లేక దక్షిణాది సినిమానా? అనేది ముఖ్యం కాదన్నారు. బాలీవుడ్ వెనుకబడటానికి ఓటీటీలే కారణమన్నారు. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు కొన్నవారాల తర్వాత హాయిగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారని అన్నారు. ఓటీటీలు లేనపుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేవారని, ఇపుడు సినిమా బాగుంటేనేగానీ థియేటర్లకు రావడం లేదన్నారు. సినిమా ఎక్కడి నుంచైనా చూడొచ్చనే బిజినెస్ మోడల్‌తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నామని చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి సినిమాలు చూసి ఆదరించాలని ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధు జొన్నలగడ్డ... జాక్ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్న సామ్ సిఎస్‌