Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బైక్ మెకానిక్ - ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేసిన "ప్రేమదేశం" హీరో!!

Advertiesment
ABBAS
, మంగళవారం, 18 జులై 2023 (19:59 IST)
దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో అనేక మంది అమ్మాలకు డ్రీమ్ బాయ్‌గా ఉన్న హీరో అబ్బాస్. "ప్రేమదేశం" చిత్రం ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు చిత్రాల్లో సోలో హీరోగా నటించారు. మరికొందరు అగ్రహీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రలను పోషించారు. అలా సాగిన అబ్బాస్ జీవితం ఒక దశలో కుటుంబ పోషణ నిమిత్తం బైక్ మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేశారు. ఇటీవల స్వదేశానికి వచ్చిన ఆయన తన ఒడిదుడుకుల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
 
"నేను అనుకోకుండానే నేను నటుడినయ్యా. సాధారణ ప్రేక్షకుడిలానే నా తొలి చిత్రం 'కాదల్‌ దేశం' (ప్రేమదేశం) ప్రీమియర్‌కి వెళ్లా. మరుసటి రోజు మా ఇంటి ముందు సముద్రాన్ని తలపించే అభిమానగణాన్ని చూసి ఆశ్చర్యపోయా. వారెందుకు నాపై అంత ప్రేమ కురిపించారో అప్పుడు నాకర్థంకాలేదు. 19 ఏళ్ల వయసులో డబ్బు సంపాదించేందుకు సినిమాని ఓ మార్గంగా ఎంపిక చేసుకున్నా. కెరీర్‌ ప్రారంభంలో విజయాలు అందుకున్నా. 
 
తర్వాత ఫెయిల్యూర్‌నీ చూశా. కనీస అవసరాలకూ డబ్బుల్లేని పరిస్థితి ఎదురైంది. అవకాశం కోసం నిర్మాత ఆర్‌.బి. చౌదరిని కలిశా. 'పూవెలి' చిత్రంలో నటించమన్నారు. కొన్నాళ్లకు నా పనిని (నటన) నేను ఆస్వాదించలేకపోయా. బోర్‌ కొట్టేసింది. అందుకే సినిమాలకు దూరమయ్యా. న్యూజిలాండ్‌ వెళ్లా. కుటుంబాన్ని పోషించేందుకు బైక్‌ మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గాను పనిచేశా'' అని అబ్బాస్‌ చెప్పారు.
 
'10 గ్రేడ్‌ ఫెయిలైనప్పుడు నాకూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అదేసమయంలో నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరంకావడంతో సూసైడ్‌ ఆలోచన బలపడింది. కానీ, దాన్నుంచి నేను బయటపడగలిగా. ఓసారి రోడ్డు పక్కన నిల్చొని.. వేగంగా వస్తున్న వాహనం ముందుకు వెళ్లాలనుకున్నా. ఆ డ్రైవర్‌ గురించి ఆలోచించి ఆగిపోయా. ఎందుకంటే.. నేను తీసుకున్న నిర్ణయం వల్ల అతడి జీవితంపై ప్రభావం పడుతుంది. కష్ట సమయంలోనూ ఇతరుల శ్రేయస్సును కోరుకునే మనస్తత్వం అలవరచుకున్నా. ఈ విషయాన్నే కొవిడ్‌ సమయంలో నా అభిమానులతో పంచుకున్నా' అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకు పాదపూజ చేసిన ప్రణీత- నెట్టింట వైరల్ అవుతోన్న పిక్చర్