Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం.. ఏ పార్టీ నుంచో చెప్పలేను : సుమన్‌

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సీనియర్ నటుడు సుమన్ ప్రకటించారు. ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయ ప్రవేశం చేస్తున్న

Advertiesment
Actor Suman
, ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (16:28 IST)
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సీనియర్ నటుడు సుమన్ ప్రకటించారు. ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నానని, అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనని తెలిపారు.
 
ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతగా కృషి చేస్తుందని భావించిన ఏ పార్టీలోనైనా చేరడమో లేదా వారికి మద్దతివ్వడమో చేస్తానన్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి మరీ దీనంగా ఉందని, వారి క్షేమాన్ని చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు. దక్షిణ భారతీయులు తమ కష్టనష్టాలు చెప్పుకోవడానికి ఉప ప్రధానమంత్రి పదవిని దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించాలని ఈ సందర్భంగా సుమన్‌ డిమాండ్‌ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ కళ్యాణ్ వల్లే ప్రత్యేక హోదాకు మద్దతిచ్చా: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌