Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగోళ్లు అన్నం పెడుతున్నారు.. తప్పుగా మాట్లాడలేదు : నటి కస్తూరి

Advertiesment
kasturi

ఠాగూర్

, మంగళవారం, 5 నవంబరు 2024 (13:30 IST)
తనకు తెలుగు చిత్రపరిశ్రమ అన్నం పెడుతుందని, అలాంటి వారిని తప్పుగా మాట్లాడలేదని తమిళ నటి కస్తూరి అన్నారు. పైగా, తాను బ్రాహ్మణ వర్గానికి చెందిన నటి కావడంతో అవకాశం వచ్చినపుడల్లా అధికార డీఎంకే తనను టార్గెట్ చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, తాను తెలుగు ప్రజలను కించపరిచేలా మాట్లాడినట్టు వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించే డీఎంకే దుష్ప్రచారం చేస్తుందని ఆమె ఆరోపించారు. 
 
300 యేళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపురంలో ఉండే మహిళలకు సేవ చేయడానికి వచ్చినవారే తెలుగు ప్రజలు అంటూ చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వ్యాఖ్యానించారు. ఇవి వివాదాస్పదం కావడంతో ఆమె సోమవారం మీడియాతో వివరణ ఇచ్చారు. 
 
ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. తాను తెలుగు వారి గురించి ఏ మాత్రం తప్పుగా మాట్లాడలేదని పునరుద్ఘాటించారు. తనపై కొంతమంది ద్రవిడ సిద్ధాంతవాదులు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు కొత్త కాదన్నారు. డీఎంకే చెప్పే యాంటీ బ్రాహ్మిణ్... యాంటీ హిందుత్వ... యాంటీ సనాతన ఐడియాలజీపై తాము మాట్లాడుతుంటామని, అందుకే తమపై ఇలా బురద జల్లుతారన్నారు. 
 
సాధారణంగా తాను సామాజికవర్గం గురించి ఎప్పుడూ మాట్లాడనన్నారు. తన సోదరుడు నిన్న నిర్వహించిన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యారని కస్తూరి వెల్లడించారు. అక్కడ తాను మాట్లాడిన దానిని కొంతమంది మరోరకంగా ప్రచారం చేశారని ఆరోపించారు. ఓ నటిగా తెలుగు వారంటే తనకు ఎంతో ఇష్టమని మరోసారి చెప్పారు. డీఎంకే పార్టీ ఎలా వ్యవహరిస్తుందో తెలుగు ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
అదేసమయంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు తాను సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపానని కస్తూరి గుర్తుచేశారు. అప్పుడు కూడా తనపై కొంతమంది విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. వరుడు ఎవరంటే? (photos)