Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

Advertiesment
Ajith Kumar

డీవీ

, గురువారం, 27 జూన్ 2024 (20:16 IST)
Ajith Kumar
స్టార్ హీరో అజిత్ కుమార్‌తో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా మేకర్స్ ఫ్యాన్స్ కి మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు. అజిత్ బ్లాక్ షేడ్స్ ధరించి ప్రిజనర్ యూనిఫామ్ లో ఎలక్ట్రిఫైయింగ్ న్యూ అవతార్ లో కనిపించిన ఈ పవర్ ప్యాక్డ్ లుక్ అదిరిపోయింది. అజిత్ చేతిపై వున్న టాటూ, బ్యాక్ గ్రౌండ్ లో మ్యాసీవ్ గన్ ఫైరింగ్ స్టన్నింగ్ గా వున్నాయి. అందరినీ ఆకట్టుకున్న ఈ ఎలక్ట్రిఫైయింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.    
 
ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అభినందన్ రామానుజం డీవోపీగా పని చేస్తుండడగా, విజయ్ వేలుకుట్టి ఎడిటర్.
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)