Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

Advertiesment
Allari Naresh released Vidrohi Trailer

దేవీ

, మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (16:06 IST)
Allari Naresh released Vidrohi Trailer
‎‎రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా విద్రోహి. వి ఎస్‌ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని  వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , 2nd సాంగ్  ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించారు. త్వరలోనే  విద్రోహి చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.
‎ట్రైలర్ విడుదల అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ.. విద్రోహి ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో పని చేసిన వారు నాకు చాలా క్లోజ్ పర్సన్స్. వారికి ఈ సినిమా మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను విడుదల చేసిన ట్రైలర్ కూడా చాలా బాగుంది. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమా సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాని అన్నారు.
‎ఈ చిత్ర నిర్మాత వెంకట సుబ్రమణ్యం మాట్లాడుతూ - మా ట్రైలర్ ను విడుదల చేసిన అల్లరి నరేష్‌గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు హీరో శ్రీకాంత్ గారు, దర్శకుడు వివి వినాయక్‌గారు , సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ తరపున ఇలాంటి సపోర్ట్ మాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు.
‎దర్శకుడు వి ఎస్‌ వి మాట్లాడుతూ.. ‘‘హీరో శ్రీకాంత్‌గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే దర్శకులు వి వి వినాయక్‌ గారు విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ చాలా మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఆర్ పి పట్నాయక్ గారు విడుదల చేసిన 2nd సాంగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది.   ఇప్పుడు ట్రైలర్ ను అల్లరి నరేష్ గారు విడుదల చేసి, టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మూవీలో రవిప్రకాష్, శివ కుమార్ అద్భుతంగా నటించారు. ఇందులోని ప్రతి క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకు రాని సరికొత్త పాయింట్‌తో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాము. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rishab Shetty: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు