Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Advertiesment
Allu Arjun at Lola VFX stuio USa

దేవీ

, మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (12:10 IST)
Allu Arjun at Lola VFX stuio USa
అల్లు అర్జున్ 22వ సినిమా, దర్శకుడు అట్లీ 26వ సినిమాను తమిళనాడుకు చెందిన  సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కథ విన్నాక అల్లు అర్జున్ చెన్నై వెల్ళి సన్ పిక్చర్ కార్యాలయంలో కళానిధి మారన్ ను, అట్లీని కలిశారు. అర్జున్ రాగానే మారన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Allu Arjun at Lola VFX stuio USa
Allu Arjun, Atlee, Kalanidhi Maran
వెంటనే  కళానిధి మారన్ సార్, లవ్ యు సార్, ధన్యవాదాలు అంటూ బదులిచ్చారు. అక్కడ టీమ్ తో కాసేపు చర్చించిన అనంతరం అమెరికాకు వెళ్ళిన వీడియో ఫుటేజ్ ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదలజేసింది.
 
Allu Arjun at Lola VFX stuio USa
Allu arjun at vfx studio
స్క్రిప్ట్ వినగానే మైండ్ బ్లోయింగ్ 
విమానంలో లాస్ ఏంజెల్స్ వెళ్ళి అక్కడ టెక్నికల్ టీమ్ ను కలిసిన వివరాలు తెలియజేశారు. అల్లు అర్జున్, అట్లీ కలిసి లాస్ ఏంజెల్స్ లో లోలా విఎఫ్.ఎక్స్. టీమ్ ను కలిశారు. అదేవిధంగా స్ప్రెక్టర్ మోషన్ టీమ్, ఫ్రాక్ట్రడ్ టీమ్, ఐరెన్ హెడ్ స్టూడియో, లెజెసీ ఎఫెక్ట్స్ స్టూడియోలకు వెళ్ళారు. అక్కడ సి.ఇ.ఓ. జోస్ ఫెర్నాండెజ్ తో కలిసి అల్లు అర్జున్ 22వ సినిమా గురించి చర్చించారు. విఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్, డైరెక్టర్ జేమ్స్ మాడిగన్ తో మాట్లాడారు. ఈ స్క్రిప్ట్ వినగానే మైండ్ బ్లోయింగ్ లా అనిపించిందని జేమ్స్ తెలియజేడం విశేషం.
 
Allu Arjun at Lola VFX stuio USa
Allu arjun at vfx studio
ఈ కథ వినగానే ఎలా అనిపించింది అని అకాడమీ అవార్డు నామి మైక్ ఎలిజెడ్ ను అల్లు అర్జున్ అడగగా, కథకు ఏవిధంగా నేను క్రియేట్ చేయగలనో అన్నీ అందులో వున్నాయి అంటూ.. అవతార్ చిత్రం చేసిన జంతువులు, మాస్క్ లు ధరించిన పలు క్రియేషన్స్ ఆయన చూపించారు. డైనోసార్ వంటివి కూడా చూపిస్తూ, యాక్షన్ పరంగా థ్రిల్ కలిగించే విధంగా చేయగల సత్తా ఈ కథకు వుందని అల్లు అర్జున్ వివరించారు. ఫైనల్ గా ఈ కథ అన్ బిలీవబుల్ అంటూ అందరూ స్టాంప్ వేసినట్లు మాట్లాడారు. సో.. అల్లు అర్జున్ ఈసారి హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళి సెన్సేషనల్ క్రియేట్ చేయబోతున్నారనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్