Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'జయదేవ్' వేడుకలో డీజే: స‌భ్య‌స‌మాజానికి ఒక‌టే మెసేజ్ ఇవ్వాల‌నే డైలాగ్ కొట్టాడు.. ఎందుకంటే?

దాసరి నారాయణ రావు అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా "డీజే.. డీజే.." అంటూ అరుస్తూ హంగామా సృష్టించిన అభిమానులపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా జయదేవ్ సినిమా ప్లాటి

Advertiesment
Allu Arjun
, బుధవారం, 28 జూన్ 2017 (18:17 IST)
దాసరి నారాయణ రావు అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా "డీజే.. డీజే.." అంటూ అరుస్తూ హంగామా సృష్టించిన అభిమానులపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా జయదేవ్ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుకలోనూ ఫ్యాన్స్‌కు హితవు పలికారు. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవీ హీరోగా పరిచయం అవుతున్న జయదేవ్ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుకలో బన్నీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. 
 
ఈ సంద‌ర్భంగా వేదిక‌పై బ‌న్నీ మాట్లాడడం మొద‌లుపెట్ట‌గానే అంద‌రూ డీజే.. డీజే అంటూ కేక‌లు వేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో అల్లు అర్జున్‌కి కోపం వచ్చింది. ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన బన్నీ.. ఆపై తాను 'స‌భ్య‌స‌మాజానికి ఒక‌ మెసేజ్ ఇవ్వాల‌ని అనుకుంటున్నానంటూ 'డీజే'లోని డైలాగు కొట్టాడు.
 
ఇలాంటి ఫంక్షన్లలో వేదికపై వక్తలు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలన్నారు. స్టేజీపై మాట్లాడే సమయంలో గోల చేయడం సంస్కారం కాదన్నాడు. ఒకరు మాట్లాడడం పూర్తయ్యాక మాత్రమే నినాదాలు వంటివి చేయాలన్నాడు. ఈ విషయాన్ని తన ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాలని సూచించాడు. ఆపై గంటా శ్రీనివాసరావు గురించి బన్నీ మాట్లాడుతూ.. ఆయనతో తమకు మంచి సంబంధాలున్నాయన్నారు. వ్యక్తిగతంగానూ, రాజకీయపరంగానూ ఆయనతో లాంగ్ జర్నీ వుందని చెప్పుకొచ్చారు. 
 
మెగాస్టార్ చిరంజీవిని గంటా శ్రీనివాస‌రావు ఇష్ట‌ప‌డ‌తారని, ఆయ‌న‌కు చిరంజీవిపై ఉన్న ఇష్టం వ‌ల్ల త‌న‌కు గంటాపై ఇష్టం మ‌రింత పెరిగింద‌ని బన్నీ కామెంట్స్ చేశారు. తాను ఈ వేడుక‌కు రావ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని గంటా శ్రీనివాస రావు త‌న‌తో అన్నార‌ని చెప్పిన బ‌న్ని.. గంటా కోసం తాను ఇక్కడకి రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీ పాలిటిక్స్‌పై ఫైర్ అయిన కస్తూరి: తమిళనాడులో వేరే సమస్యలు లేవా? అంటూ ప్రశ్న