కీర్తి శేషులు అల్లు రామలింగయ్య సతీమణి , అల్లు అరవింద్ మాతృమూర్తి . అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నం (94) ఈ రోజు ఉదయం స్వర్గస్తులైనారు. అరవింద్. గారింటికి పార్థివ దేహం చేరుకుంది. ముంబై నుంచి షూటింగ్ ను కాన్సిల్ చేసుకుని అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్నారు. అదే సమయంలో పెద్ది షూటింగ్ ను కాన్సిల్ చేసుకుని హైదరాబాద్ వచ్చారు. వారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నాలెజినోవా కూడా హాజరయ్యారు.
చిరంజీవి అరవింద్ గారి ఇంటికి చేరుకున్నారు. బన్నీ ముంబై నుంచి మధ్యాహ్నానికి చేరుకొంటారు అల్లు కనకరత్నమ్మ గారికి 94 సంవత్సరాలు. వృధాప్య కారణంగా పలు సమస్యలు తలెత్తాయి. అర్ధరాత్రి దాటాక అంటే 1.45 am ఆమె నిద్రలోనే శ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కోకాపేట లో అంత్యక్రియలు జరగనున్నాయి. కోకాపేటలోని ఫామ్ హౌస్ లో అల్లు రామలింగయ్య సమాధి కూడా అక్కడే వుంది.
పవన్ కళ్యాణ్, నాగబాబు వైజాగ్ లో జరగనున్న పబ్లిక్ మీటింగ్ లో ఉన్నందున రేపు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలుపుతారు