Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టిల్.. ఐ యామ్ వర్జిన్ అంటున్న బాలీవుడ్ భామ.. ఎవరు?

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే భామలు ఎంతో బోల్డ్‌గా ఉంటారు. అదేసమయంలో వారు వివిధ అంశాలపై చేసే కామెంట్స్ ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేయడమేకాకుండా, కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కూడా అవుతుంటాయి.

Advertiesment
Amyra Dastur
, శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (16:54 IST)
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే భామలు ఎంతో బోల్డ్‌గా ఉంటారు. అదేసమయంలో వారు వివిధ అంశాలపై చేసే కామెంట్స్ ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేయడమేకాకుండా, కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కూడా అవుతుంటాయి. గతంలో పలువురు హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్‌పై తమ మనసులోని మాటలను వ్యక్తం చేసి.. హాట్‌టాపిక్‌గా మారారు. 
 
ఇపుడు వర్జినిటీపై ఈ ముంబై భామ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ భామ ఎవరో కాదు. అమైరా దస్తూర్. సరిగ్గా మూడేళ్ళ క్రితం తమిళ హీరో ధనుష్ హీరోగా వచ్చిన చిత్రం "అనేగన్". ఇందులో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమైరా. ఆ తర్వాత ఇప్పుడు 'మనసుకు నచ్చింది' చిత్రంతో తెలుగు వెండితెర అరంగేట్రం చేస్తోంది. అలాగే, రాజ్ తరుణ్ సరసన 'రాజుగాడు' అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. 
 
ఈనేపథ్యంలో ఈమె ఓ ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో టకటకా సమాధానాలు చెప్పేసింది. ఇందులోభాగంగా, తన వర్జినిటీ మీద కూడా కామెంట్ చేసింది. ఏ వయసులో వర్జినిటీ కోల్పోయారు అడగ్గానే 'ఎవరు చెప్పారు నేను వర్జిన్‌ను కాదని.. నా పెళ్లి జరిగే వరకూ నేను కన్యగానే ఉంటాను' అని ఠక్కున సమాధానమిచ్చింది. 
 
నిజానికి చాలామంది బాలీవుడ్ భామలు.. చిన్నవయసులోనే వర్జినిటీ కోల్పోయామని అదేదో అదనపు అర్హతలా భావించి గొప్పగా చెపుతుంటారు. ఒకవేళ చెప్పడం ఇష్టం లేకుంటే ఆ ప్రశ్నను పాస్ చేసేస్తుంటారు మరికొందరు. కానీ అమైరాలా వర్జినిటీ గురించి ఘంటాపథంగా చెప్పడం మాత్రం అరుదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నుకొట్టిన ప్రియా... నవ్వుకున్న సుప్రీం జడ్జీలు