Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ బాహుబలితో అనుపమ్ ఖేర్ - తన 544వ చిత్రమంటూ...

Advertiesment
anupam kher - prabhas

ఠాగూర్

, గురువారం, 13 ఫిబ్రవరి 2025 (14:34 IST)
భారతీయ బాహుహలితో తన 544వ చిత్రంలో నటించనున్నట్టు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురువారం తన ఇన్‌స్టా ఖాతా వేదికగా వెల్లడించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెనున్న ఈ చిత్రం పేరు ఫౌజీ. ఈ భారీ మూవీలో తాను నటిస్తున్నట్టు అనుపమ్ ఖేర్ ప్రకటించారు. ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్, దర్శకుడు హను కలిసి దిగిన ఫోటోను ఆయన షేర్ చేశారు. 
 
"భారతీయ సినిమా బాహుబలితో నా 544వ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి చాలా ప్రతిభావంతుడైన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నార. నా ప్రియమైన స్నేహితులు సుదీప్ ఛటర్జీ ఈ మూవీకి కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా చాలా మంతి కథతో తెరకెక్కుతుంది" అంటూ అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్నలిస్టుపై దాడి కేసు- మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్