Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. మార్మోగుతున్న బాహుబలి ప్రభాస్

జీవితకాలంలో ఒకే ఒక్కసారి లభించే అవకాశం అంటూ ప్రభాస్ ఏ ముహూర్తంలో బాహుబలి సినిమాలో నటించడానికి అంగీకరించాడో కానీ.. ఆ నిర్ణయ బలం అతడిని ఒక్కసారిగా అంతర్జాతీయ చిత్ర యవనికపై నిలిపింది. అయిదేళ్ల కఠోర పరిశ్రమ, అంకితభావం, ఒక చిత్రంకోసం కెరీర్‌నే పణంగా పెట్ట

Advertiesment
baahubali the conclusion
హైదరాబాద్ , గురువారం, 13 ఏప్రియల్ 2017 (09:59 IST)
జీవితకాలంలో ఒకే ఒక్కసారి లభించే అవకాశం అంటూ ప్రభాస్ ఏ ముహూర్తంలో బాహుబలి సినిమాలో నటించడానికి అంగీకరించాడో కానీ.. ఆ నిర్ణయ బలం అతడిని ఒక్కసారిగా అంతర్జాతీయ చిత్ర యవనికపై నిలిపింది. అయిదేళ్ల కఠోర పరిశ్రమ, అంకితభావం, ఒక చిత్రంకోసం కెరీర్‌నే పణంగా పెట్టడానికి సాహసించిన తెంపరితనం.. అంటూ బాలీవుడ్ ఇప్పుడు ప్రభాస్ జపం చేస్తోందంటే అతిశయోక్తి కాదు. బాహుబలి ది బిగినింగ్ విడుదలైన రోజు.. ఒకే ఒక్క రాత్రి.. ప్రభాస్ అనే ఆరడుగుల పొడగరి జాతీయ కీర్తిని అందుకున్నాడు.
 
ఇప్పుడు వంతు హాలీవుడ్‌ది అయింది. హాలీవుడ్‌లో అత్యద్భుత చిత్రంగా పేరొందిన గేమ్ ఆఫ్ థ్రోన్స్  చిత్ర నిర్మాతలు బాహుబలి నటుడు ప్రభాస్‌ని, ఆన్‌స్క్రీన్‌లో అతడి పాత్రను చూసి మంత్రముగ్ధులయ్యారని తెలుస్తోంది. పైగా బాహుబలి ది కన్‌క్లూజన్‌ నిర్మాణంలో పలువురు అంతర్జాతీయ చిత్రరంగ నిపుణులు పాల్గొన్నారన్న విషయం హాలీవుడ్‌ను ఆశ్చర్యపరుస్తోంది.  ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభాస్ అనబడే బాహుబలి ఇప్పుడు అంతర్జాతీయ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమై కూర్చున్నాడు. 
 
రాజమౌళి స్వప్నాన్ని సాకారం చేయడానికి, బాహుబలి పాత్ర పోషణకు ప్రబాస్ అయిదేళ్ల విలువైన కాలాన్ని కేటాయించాడు. రాజమౌళి ఇటీవల చెన్నయ్‌లో బాహుబలి-2 సినిమా తమిళ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఇదే విషయాన్ని సవాల్ చేశాడు.  బాహుబలికి ప్రభాస్ కాకుండా మరొకరెవరైనా మీ ఊహల్లో ఉండేవారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ తాను నమ్మిన పాత్ర కోసం మూడేళ్లకు పైగా అమూల్యమైన కాలాన్ని వెచ్చించగలిగే ఒక్క నటుడిని చూపండి అంటూ సవాలు చేశాడు. నిజంగానే రాజమౌళి ప్రకటనకు, సవాలుకు ప్రభాస్ శక్తివంతమైన పాత్రపోషణ పూర్తిగా న్యాయం చేసిందనే చెప్పాలి. 
 
ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, సత్యరాజ్, తమన్నా, రమ్యకృష్ణ నాజర్ తదితరులు నటించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గ్లామర్' అంటే 'న్యూడ్' అని కాదు... స్కిన్ షోకు రెడీ. చూపించే వారే లేరు..: లావణ్య త్రిపాఠి