Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

Advertiesment
Allari Naresh, Amrita Iyer

డీవీ

, శుక్రవారం, 22 నవంబరు 2024 (17:23 IST)
Allari Naresh, Amrita Iyer
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బచ్చల మల్లి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం హై-ఆక్టేన్ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ గా వుండబోతోంది. బచ్చల మల్లిని డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. ఈ రోజు అన్ స్టాపబుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ మూవీ సెకండ్ సింగిల్- అదే నేను అసలు లేను సాంగ్ ని లాంచ్ చేశారు.
 
అద్భుతమైన ట్రాక్స్ ని అందించే స్టార్ కంపోజర్ విశాల్ చంద్రశేఖర్, బచ్చల మల్లిలో అల్లరి నరేష్, అమృత అయ్యర్‌ మధ్య బాండింగ్ ని అందంగా ప్రజెంట్ చేసే మెలోడీని కంపోజ్ చేశారు. అల్లరి నరేష్, ఒకప్పుడు రగ్గడ్ గా ఉండే వ్యక్తి, అమృత అయ్యర్ తో సోల్ ఫుల్ జర్నీ తో తన క్యారెక్టర్ లో వచ్చే మార్పును సాంగ్ చాలా బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది.  
 
కృష్ణకాంత్ లిరిక్స్ లీడ్ పెయిర్ ఎమోషనల్ జర్నీని పొయిటిక్ గా ప్రజెంట్ చేశాయి. SP చరణ్ వోకల్స్ ట్రాక్‌కి యూనిక్ చార్మ్ ని తీసుకొస్తే, రమ్య బెహరా ప్లజెంట్ వాయిస్ మెలోడీని బ్యూటీఫుల్ గా కంప్లీట్ చేసింది. అల్లరి నరేష్, అమృత అయ్యర్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. విజువల్స్ కంపోజిషన్ ని మరింతగా ఎలివేట్ చేశాయి.
 
బచ్చల మల్లిలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 
మానాడు, రంగం, మట్టి కుస్తి వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎమ్ నాథన్ డీవోపీగా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
 
కథ, మాటలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, అడిషినల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్