Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అద్భుతమైన విజువల్స్‌తో 'దేవర' .. ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా!!

Advertiesment
devara movie

ఠాగూర్

, ఆదివారం, 11 ఆగస్టు 2024 (11:28 IST)
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "దేవర". జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శవరేగంగా సాగుతుంది. కెమెరామెన్‌గా రత్నవేలు పని చేస్తున్నారు. ఈయన తాజాగా ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ ఇచ్చారు. సెట్‌లో దిగిన ఫొటో షేర్ చేసిన ఆయన .. 'ఈ చిత్రంలోని ఓపెనింగ్‌ సాంగ్‌ షూట్‌ చేస్తున్నాం. అద్భుతమైన విజువల్స్‌.. అనిరుధ్‌ మ్యూజిక్‌తో ఇది చాలా చక్కగా సిద్ధమవుతోంది. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌ గ్రేస్‌, స్టైల్‌ మామూలుగా లేవు. ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా' అని పేర్కొన్నారు. 
 
ఈ పాటకు ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారని తెలిపారు. ఈ పోస్ట్‌తో ఎన్టీఆర్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, 'జనతా గ్యారేజ్‌' తర్వాత హీరో ఎన్టీఆర్‌ - డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. దీంతో ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
devara movie
 
రెండు భాగాలుగా దీనిని సిద్ధం చేస్తున్నారు. 'దేవర' పార్ట్‌ 1 సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విస్మరణకుగురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ విడుదలైంది. 'చుట్టమల్లే' అంటూ సాగే ఈ పాటను ఎన్టీఆర్‌ - జాన్వీకపూర్‌పై చిత్రీకరించారు. ఈ పాట యూట్యూబ్‌లో దాదాపు 41 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా ప్రొడక్షన్ లో కొంత హాలీవుడ్ టెక్నాలజీ అడాప్ట్ చేశాం : ప్రొడ్యూసర్ టి.జి.విశ్వ ప్రసాద్