Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టీసీ బస్సులో దివ్యాంగుడి అద్భుతమైన గాత్రం.. సజ్జనార్ చొరవతో తమన్ ఛాన్స్.. (Video)

Advertiesment
Bus Singer

సెల్వి

, గురువారం, 14 నవంబరు 2024 (22:05 IST)
Bus Singer
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. అంధ యువకుడు పాడిన ఈ పాటను ఆ బస్సులో ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు దివ్యాంగుడైనా అద్భుతమైన గాత్రంతో అందరికి ఆకట్టుకున్నాడు. అయితే ఈ అంధ యువకుడు పాడిన పాట తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కంట పడింది. 
 
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సజ్జనార్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో ఆ యువకుడు శ్రీ ఆంజనేయం సినిమాలోని రామ రామ రఘురామ పాట పాడుతూ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అతని పాటను విన్న ప్రయాణికులు సైతం చప్పట్లతో అతన్ని అభినందించారు. ఆ అంధుడు పాడిన పాట సజ్జనార్‌ హృదయాన్ని కదిలించింది. 
webdunia
Sajjanar
 
ఈ యువకుడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు సజ్జనార్‌. మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్’ అని ట్వీట్‌ చేశారు. అద్భుతమై గాత్రంతో.. లయబద్ధంగా పాడుతూ.. తాళం వేస్తూ అందరినీ ఆకట్టుకున్న ఆ దివ్యాంగుడు మట్టిలో మాణిక్యమంటూ కొనియాడారు. 
 
ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఎంఎం కీరవాణి సార్ అంటూ రిక్వెస్ట్ చేశారు. అయితే సజ్జనార్ రిక్వెస్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించారు. ఆ దివ్యాంగ యువకుడికి తాను పాడడానికి అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. 
webdunia
S.S. Thaman
 
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్‌లో అతను పాల్గొనేలా చూడాలని ఆహా టీంను కోరారు. ఆ యువకుడితో కలిసి పెర్ఫార్మ్ చేయడానికి తాను రెడీగా ఉన్నట్టు వెల్లడించారు. ఇందుకు సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి ఆర్టీసీ ఎండి సజ్జనార్ చేసిన ట్వీట్‌తో ఓ దివ్యాంగ యువ సింగర్‌కు అద్భుతమైన అవకాశం వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్