Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ఆచార్య’ టీజర్ లీక్ చేయ‌నా! మెగాస్టార్‌

Advertiesment
Atcharya
, బుధవారం, 27 జనవరి 2021 (10:20 IST)
Acharya,Chiranjeevi
మెగాస్టార్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ద‌ర్శ‌కుడు కొర‌టాల‌. ఇంకా టీజ‌ర్ రిలీజ్ చేయ‌వా! లేదంటే చెప్పు నేనే లీజ్ చేస్తానంటూ... చిరు, కొర‌టాల‌తో స‌ర‌దాగా అన్న సంభాష‌ణ‌లు మెగాస్టార్ ట్వీట్ చేశాడు.
 
`సైరా` తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆచార్య`. మెగాస్టార్‌తో సినిమా చేయాలనే ఉద్దేశంతో సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దాదాపు రెండు సంవత్సరాలు ఖాళీగా ఉండిపోయారు. సినిమా ప్రారంభమై షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. అయితే సినిమా టీజర్ కోసం మెగాభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

కొత్త ఏడాదికే వస్తుందనుకున్న టీజర్ సంక్రాంతి దాటిపోయి రిపబ్లిక్ డే వచ్చేసినా ఇప్పటి వరకు విడుదల కాలేదు. దీంతో మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివతో కలిసి ఈ టీజర్‌పై అప్‌డేట్‌ను సరదా సంభాషణతో అభిమానులకు అందించారు. కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్న సందర్భంగా తీసిన ఫొటోలపై ఆ సంభాషణను రాసి మెగాస్టార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ సంభాషణ చాలా ఆసక్తికరంగా, కాస్తంత ఫన్నీగా ఉంది. సంభాషణ ఏంటంటే..
 
ఏమయ్యా కొరటాల... ఆచార్య టీజర్ న్యూ ఇయర్‌కు లేదు. సంక్రాంతికి లేదు. ఇంకెప్పుడు? అని మెగాస్టార్ చిరంజీవి ప్రశ్నిస్తే.. ‘సర్.. అదే పనిలో ఉన్నా’ అని కొరటాల శివ సమాధానమిస్తారు. ‘ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా’ అని మెగాస్టార్ అంటారు. దీనికి కొరటాల స్పందిస్తూ ‘రేపు మార్నింగే అనౌన్స్‌మెంట్ ఇచ్చేస్తా సర్’ అని అంటారు.

‘ఇస్తావ్ గా..’ అని మెగాస్టార్ మరోసారి స్పష్టంగా అడిగితే.. ‘‘అనౌన్స్‌మెంట్ రేపు ఉదయం 10 గంటలకు పక్కా సర్’ అని కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్, కొరటాల సంభాషణల ప్రకారం బుధవారం ఉదయం పది గంటలకు ఆచార్య టీజర్ అనౌన్స్‌మెంట్ రానుంది. అయితే ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఇలా చిత్ర కథానాయకుడు, దర్శకుడి సంభాషణతో అప్ డేట్ రాలేదు. టీజర్ ఎనౌన్స్‌మెంట్ అప్‌డేటే ఇలా కొత్తగా ఉంటే ఇక టీజర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అని మెగా ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
 
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైకిల్‌పై తిరిగిన రోజులు గుర్తుకు వ‌స్తున్నాయ్‌: యాంకర్, నటుడు ప్రదీప్