Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రమోహన్ క్రమశిక్షణ ఈ తరం ఆదర్శంగా తీసుకోవాలి.. ప్రముఖుల నివాళి

Advertiesment
Bramhanandam nivali- Sivalenka krishna prasad
, శనివారం, 11 నవంబరు 2023 (19:41 IST)
Bramhanandam nivali- Sivalenka krishna prasad
ఈరోజు ఉదయం మరణించిన చంద్రమోహన్ భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ అపోలో ఆసుప్రతి నుంచి సమీపంలోని ఆయన ఇంటికి తీసుకువచ్చారు. సోమవారంనాడు అంత్య క్రియలు బ్రాహ్మణ సంప్రాదాయం ప్రకారం జరుగుతాయని ఆయన మేనల్లుడు ఆదిత్య 369 నిర్మాత శివలెంక క్రిష్ణ ప్రసాద్ తెలిపారు. ఈరోజు పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
 
Bramhanandam nivali- Sivalenka krishna prasad
senior actor balaji nivali
నాకు పేరు పెట్టింది ఆయనే.. రేలంగి నరసింహారావు
మా గురువు దాసరి గారు సినిమాల్లో చంద్రమోహన్ నటిస్తుండగా చూసే వాడిని. రుక్మందరావు నిర్మాత గారు ఓ సినిమా చేయమని అడిగారు. అలా చంద్రమోహన్ తో బీజం మొదలైంది. చంద్రమోహన్ గారితో 24  సినిమాలు చేశాను.నేను మా ఆవిడ, సుందరీ సుబ్బారావు..వంటి పలు సినిమాలు తీశాను. చంద్రమోహన్ విజయశాంతి కాంబినేషన్ లో తీశా. ఆయన్నుంచి నేను కామెడీ పట్లు నేర్చుకుని సినిమాలు తీశా. జంథ్యాల గారు కూడా నన్ను మెచ్చుకొనేవారు. చంద్రమోహన్ గారే నాకు కామెడీ దర్శకుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆయన లేరని నిజం జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే వంశీరామరాజు గారు చంద్రమోహన్ గారి గురించి వేసిన 
పుస్తకంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా రంగానికి దురద్రుష్టకరమని. నివాళులర్పించారు.
 
Bramhanandam nivali- Sivalenka krishna prasad
damodara prasad nivali
దామోదర ప్రసాద్.. ఛాంబర్ కార్యదర్శి
ఇాది అనుకోని ఘటన. అప్పట్లో సూపర్ స్టార్ లు ఏలుతున్న తరుణంలో మిడ్ ఏజ్ సినిమాలకు సూపర్ స్టార్ అయ్యారు. డిసిప్లిన్ మనిషి. వయస్సు రీత్యా పాత తరం వెళ్ళిపోతుంది. ఈ తరం ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి. ఫిలిం ఇండస్ట్రీ తరఫున సానుభూతి తెలియజేస్తున్నా.
 
రామ సత్యనారాయణ.. నిర్మాత
చంద్రమోహన్ గారితో రామరాజ్యం వచ్చింది సినిమా తీశా. ప్రభ హీరోయిన్. కాలక్రమంలో వయస్సు రీత్యా నేను సినిమాల్లో నటించను. శేష జీవితాన్ని దైవ కార్యక్రమాల్లో గడుపుతాను అనేవారు.  175  సినిమాల్లో హీరో.  ఆయన ఏ సినిమా చేసినా హిట్ లో ఆయన పాత్ర వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్ అద్దంలో చూసుకున్నావా అన్నారు...పట్టుదలతో స్పార్క్ తీశా.. హీరో విక్రాంత్