Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు చిరంజీవి "విశ్వంభర" మూవీ టీజర్

Advertiesment
vishwambara

ఠాగూర్

, శనివారం, 12 అక్టోబరు 2024 (09:07 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "విశ్వంభర". ఈ చిత్రం బృందం కీలక సమాచారాన్ని వెల్లడించింది. విజయదశమి పండుగను పురస్కరించుకుని శనివారం "విశ్వంభర" చిత్రం టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. శనివారం ఉదయం 10.49 గంటలకు ఈ టీజర్‌ను రిలీజ్ చేస్తామని దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
"విశ్వంభర" చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటించగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణం సంగీతం అందిస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్‌కు చిరంజీవి కూడా హాజరవడం తెలిసిందే. చిరు తనకు బాగా నచ్చిన బాణీలను ఎంపిక చేసుకుని సాంగ్స్ చేయించుకుంటున్నారు. గతంలో చిరంజీవి - కీరవాణి కాంబోలో వచ్చిన "ఘరానా మొగుడు" ఎంత పెద్ద మ్యూజికల్ మ్యూజికల్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలోని టీ ఎస్టేట్‌ల గుండా ఏరోబిక్ పరుగును ఆనందిస్తున్న విజయ్ దేవరకొండ