Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

Advertiesment
Adivi Shesh and Mrinal Thakur

డీవీ

, మంగళవారం, 17 డిశెంబరు 2024 (15:17 IST)
Adivi Shesh and Mrinal Thakur
అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' అడ్రినలిన్ పంపింగ్ ఎక్స్ పీరియన్స్ తో రూపొందుతోంది. షనైల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు.

అడివి శేష్ ,షానీల్ డియో సంయుక్తంగా కథ, స్క్రీన్ ప్లే రూపొందిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్‌తో కొనసాగుతుంది.
 
ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా, అడివి శేష్ తన లీడింగ్ లేడి ని ఈ హై ఆక్టేన్ ఫేస్ ఆఫ్‌లోకి స్వాగతిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా చేరారు. ఇద్దరు ఎక్స్ లవర్స్ మధ్య యాక్షన్, ఎమోషన్, డ్రామాతో నిండిన కథలోకి ఎంటరవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
 
సినిమా అనౌన్స్ మెంట్ చేసే ట్రెండ్‌కి బిన్నంగా, అడివి శేష్ తన ఫీమేల్ లీడ్ మృణాల్ ఠాకూర్‌ని అనౌన్స్ చేసి, అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా చేశారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ పాత్రల మధ్య  కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తూ డకోయిట్ టీం ఇంటెన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తనకు ద్రోహం చేసిన తన ఎక్స్ లవర్ పై ప్రతీకారం తీర్చుకునే కోపంతో ఉన్న దోషి కథగా డకోయిట్ వుండబోతుంది. ప్రేమ, ద్రోహం,ప్రతీకారం పవర్ ద్వారా నడిచే తీవ్రమైన యాక్షన్ డ్రామాకు వేదికగా ఆమెను ట్రాప్ చేయడానికి అతను ప్రమాదకరమైన ప్లాన్ ని రూపొందించాడు.
 
అడివి శేష్ ,మృణాల్ ఠాకూర్‌లతో కూడిన రెండు కొత్త పోస్టర్‌లు విడుదల చేశారు, వారి పాత్రల ఇంటెన్స్ డైనమిక్స్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఒక పోస్టర్‌లో, శేష్ ఫెరోషియస్ గా కనిపించారు,మృణాల్ అతని వైపు విచారంగా చూస్తోంది. రెండవ పోస్టర్ భిన్నమైన  ఇంటన్సిటీని చూపిస్తోంది. శేష్ కారులో స్టైలిష్‌గా కూర్చుని, సిగరెట్ వెలిగించగా, మృణాల్ కారు నడుపుతూ, చేతిలో తుపాకీతో  కనిపించింది. రెండు పోస్టర్లు క్యారెక్టర్స్ కాంప్లెక్స్ సిటీని హైలైట్ చేస్తున్నాయి.  
 
మృణాల్ ఠాకూర్‌ను డకాయిట్ ప్రపంచానికి స్వాగతిస్తూ, అతని పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రేట్ అనౌన్స్ మెంట్ చేసిన అడివి శేష్ మాట్లాడుతూ "డకోయిట్ టచ్చింగ్ లవ్ స్టొరీతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ మూవీ. మృణాల్ బిగ్ స్క్రీన్ పై కొన్ని అత్యుత్తమ పాత్రలకు జీవం పోషింది, ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకతను తీసుకురావడం, ప్రతి పాత్రను ఎలివేట్ చేయడంలో ఆమె అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. మృనాల్‌ను డాకోయిట్ టీమ్‌కి స్వాగతిస్తున్నాను బిగ్  స్క్రీన్స్ పై తలపడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను."
 
డాకాయిట్ టీమ్‌లో చేరినందుకు సంతోషించిన మృనాల్ ఠాకూర్  మాట్లాడుతూ.. "డకాయిట్ టీమ్‌లో చేరినందుకు సంతోషిస్తున్నాను, అడివి శేష్, షానీల్ డియో  స్టైలిష్ విజన్ తో ఇంటెన్స్ కథలను బ్లెండ్ చేస్తూ డకోయిట్ కథని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.  సినిమాలో నా పాత్ర యాక్టర్ గా కొత్త కోణాలను అన్వేషించే అవకాశాన్ని అందిస్తుంది. ఆర్ట్, స్క్రిప్ట్, విజన్ కలయిక ఈ ప్రాజెక్ట్‌ చాలా ఎక్సయిట్మెంట్ ఇచ్చింది. షానెల్ ప్రపంచంలో లీనం కావడం ఆనందంగా వుంది' అన్నారు
 
దర్శకుడు షానీల్ డియో మాట్లాడుతూ"మృణాల్ ఠాకూర్ డాకోయిట్ టీంలో  చేరినందుకు మేము సంతోషిస్తున్నాము. ఆమె మల్టీ ట్యాలెంటెడ్. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామాకు ఆమె జీవం పోస్తోంది. అడివి శేష్ ,మృణాల్ ఠాకూర్ జోడి అద్భుతంగా వుంటుంది. ఈ విలక్షణమైన పాత్రలో ప్రేక్షకులు ఆమెను చూసేందుకు , శేష్ , మృణాల్ తమ మొదటి ప్రాజెక్ట్‌లో కలిసి రూపొందిస్తున్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఎదురుచూస్తున్నాను." అన్నారు
 
సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్