Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిప్యూటీ సీఎం పవన్‌తో కుమార్తె ఆద్య సెల్ఫీ: రేణూ దేశాయ్ స్పందన

Advertiesment
Adya selfie with her father Deputy CM Pawan

ఐవీఆర్

, శుక్రవారం, 16 ఆగస్టు 2024 (21:23 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడలో అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకలో పవన్ కూతురు ఆధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆధ్య తన తండ్రితో కలిసి సెల్ఫీ దిగింది. పవన్ వేదికపై కుర్చీలో కూర్చుని వుండగా ఆద్య ఆయన వెనుక నిలబడి ఉన్నప్పుడు ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమార్తె ఆధ్య ఈ వేడుకల్లో పాల్గొనడం, సెల్ఫీ ఫోటో తీసుకోవడంపై రేణు సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేశారు. “నేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నాన్నతో కలిసి వెళ్లవచ్చా? అని ఆద్య నన్ను అడిగింది. ఆమె తన తండ్రితో కొంత సమయం గడపడం, అందులోనూ చాలా ముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తి జీవితం ఎంత హడావిడిగా ఉంటుందో నా కుమార్తె దగ్గరగా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న కృషిని అర్థం చేసుకుంటుంది, అభినందిస్తుంది'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రేణు దేశాయ్ పోస్ట్ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'హరిహరవీరమల్లు' నుంచి కీలక అప్‌డేట్... షూటింగ్ ప్రారంభం!!