Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dil Raju: టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తాను.. దిల్ రాజు

Advertiesment
Dil Raju

సెల్వి

, సోమవారం, 6 జనవరి 2025 (12:10 IST)
Dil Raju
ఒక నిర్మాతగా టికెట్ రేట్లు పెంచమని ఒకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తానని గేమ్‌ చేంజర్‌ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని చెప్పారు. కానీ ఒక నిర్మాతగా ప్రభుత్వాన్ని కోరాల్సిన బాధ్యత తనపై వుందని.. సినీ పరిశ్రమకు తప్పకుండా అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారనే విషయాన్ని దిల్ రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ఆశతో మళ్లీ రేవంత్‌ రెడ్డిని కలుస్తానని ప్రకటించారు.
 
టికెట్ రేటు పెంచడం వల్ల 18శాతం ప్రభుత్వానికి వెళుతుందని… భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం ఉండాలని కోరారు. అలాగే ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశారని తెలిపారు. తెలుగు సినిమా భారీ స్థాయిలో రూపొందుతున్నాయని అందుకే ప్రపంచ ఖ్యాతి దక్కుతుందని దిల్ రాజు అన్నారు. 
 
ఇక గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకుల మృతిపై స్పందించిన నిర్మాత దిల్ రాజు… ఇలాంటివి జరుగుతాయి అనే పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దు అన్నారు.. నేను చరణ్ కావాలని రిక్వెస్ట్ చేశామన్నారు. వారి కుటుంబానికి రూ.5 లక్షలు సాయం వెంటనే పంపిస్తానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్... 'కన్నప్ప' నుంచి మరో పోస్టర్ రిలీజ్!