Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డీజే (దువ్వాడ జగన్నాథమ్) కథ ఎలా ఉందంటే.. క్లైమాక్స్‌ లీక్...

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో హరీష్ శంకర్ దర్శత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం డీజే దువ్వాడ జగన్నాథమ్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. రూ.70 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని

Advertiesment
Duvvada Jagannadham Review
, శుక్రవారం, 23 జూన్ 2017 (08:41 IST)
అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో హరీష్ శంకర్ దర్శత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం డీజే దువ్వాడ జగన్నాథమ్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. రూ.70 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫ్యాన్స్ షో వేయగా మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
 
అయితే, ఈ చిత్రం కథపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ, 'సినిమాల్లో సందేశాలు చెబితే ఎవరూ వినరు. 70-80 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసేవారు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనుకుంటారే తప్ప సందేశాలివ్వాలనుకోరు. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలనీ అనుకోరు' అని స్పష్టం చేశారు. 
 
ఇందులో బన్నీ చేసింది రెండు పాత్రలా? ఒక పాత్రలో రెండు షేడ్సా అనేది తెరమీద చూడాలి. రెండు గెటప్పులను విడుదల చేసినప్పటి నుంచీ ఈ విషయమై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. మనదగ్గర హీరోలు బ్రాహ్మిణ పాత్రల్లో అరుదుగా కనిపిస్తుంటారు కాబట్టి ఈ సినిమా మరేదో సినిమాకు పోలికేమోననే గాసిప్స్‌ వచ్చాయి. వాటిలో నిజం లేదు. డీజే వినోదాత్మకంగా ఉంటూనే ఇంటెన్సిటితో కూడిన ఎమోషనల్‌ చిత్రంగా సాగుతుందన్నారు. 
 
డీజేలో సందేశాలేం లేవు. సినిమాను చూసి పొందిన స్ఫూర్తి మహా అయితే కొన్ని గంటలు.. కొన్నాళ్లు.. మరీ అద్భుతాలైతే కొన్ని నెలలు ఉంటాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఇక క్లైమాక్స్‌ గురించి చెబుతూ ‘‘డీజే క్లైమాక్స్‌లో ఫైట్‌ లేదు. క్లైమాక్స్‌ ఎన్ని సార్లు ఆలోచించినా ఫైట్‌ను డిమాండ్‌ చేయలేదు. ప్రీ ఇంటర్వెల్‌ ఫైట్‌ ఉంది. నా కెరీర్‌లో బెస్ట్‌ ఫైట్‌ అదే. ఏ కథలో అయినా హీరోదే అంతిమ విజయం అని అందరికీ తెలుసు. మన తెలుగు సినిమాలు చాలా వరకు ఫైట్‌ సీన్లతో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎండ్‌ అయిపోతుండటం నాకు నచ్చలేదు. ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’లో ఆ ట్రెండ్‌ని కాస్త బ్రేక్‌ చేయడానికి ట్రై చేశా. ఈ సినిమాలో పూర్తిగా సక్సెస్‌ అయ్యాను’’ అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి బాలయ్యతో మళ్లీ జతకడుతున్న నయనతార