Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా హిట్ చిత్రమే పుష్ప 2 ది రూల్. ఈ సినిమా విడుదలై రికార్డు వసూళ్లు అందుకోగా ఇటీవల దిగ్గజ స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది.
ఇలా వచ్చిన నాలుగు రోజుల్లోనే రికార్డు వ్యూస్ అందుకోగా ఇపుడు స్ట్రీమింగ్ గంటల్లో కూడా బిగ్గెస్ట్ రికార్డు అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలా పుష్ప 2 సినిమా 22 మిలియన్ స్ట్రీమింగ్ హవర్స్ మొదటి వారానికి లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది.
ఇకపోతే.. పుష్ప: ది రైజ్, దాని సీక్వెల్ పుష్ప: ది రూల్‌తో, అల్లు అర్జున్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకున్నాడు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆయన ప్రజాదరణ గణనీయంగా పెరిగింది.
ఇటీవల, మహారాష్ట్రకు చెందిన ఒక అభిమాని కుంభమేళాలో అల్లు అర్జున్ పోషించిన ఐకానిక్ పాత్ర పుష్ప రాజ్ లాగా దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
పుష్ప సిగ్నేచర్ గడ్డం, స్టైల్, వ్యవహార శైలిని ప్రదర్శించిన ఆ అభిమాని, ఆ పాత్రను పోలి ఉండటంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించిన ఆ అభిమాని, పుష్ప: ది రూల్ చిత్రంలోని డైలాగ్‌లను చెప్పి కుంభమేళాలో భద్రతా సిబ్బంది దృష్టిని ఆకర్షించాడు.
విధుల్లో ఉన్న పోలీసులు ఆ చర్యను ఆస్వాదిస్తూ కనిపించారు. అతని ఉత్సాహాన్ని కూడా ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.