Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూర్య గేటు దూకినా వాళ్లు మాత్రం పట్టించుకోలేదు... దేన్ని?

ఇటీవలే సంక్రాంతి పండుగకు విడుదలైన తమిళ నటుడు సూర్య చిత్రం తమిళంలో మంచి వసూళ్లు రాబడుతోంది కానీ తెలుగులో మాత్రం తుస్ మంటోంది. కానీ సూర్య కాలికి బలపం కట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో తిరిగినా జనం మాత్రం సినిమాను అంతగా ఆదరించలేదు. దీనితో వసూళ్లు మందగమనంగా

Advertiesment
Gang Movie
, శుక్రవారం, 19 జనవరి 2018 (14:18 IST)
ఇటీవలే సంక్రాంతి పండుగకు విడుదలైన తమిళ నటుడు సూర్య చిత్రం తమిళంలో మంచి వసూళ్లు రాబడుతోంది కానీ తెలుగులో మాత్రం తుస్ మంటోంది. కానీ సూర్య కాలికి బలపం కట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో తిరిగినా జనం మాత్రం సినిమాను అంతగా ఆదరించలేదు. దీనితో వసూళ్లు మందగమనంగా సాగుతున్నాయి. ఒకప్పుడు సూర్య మార్కెట్ ఓ రేంజిలో వుండేది. కానీ ఇప్పుడు క్రమంగా దిగజారుతోంది. 
 
దీనిపై టాలీవుడ్ విశ్లేషకులు చెపుతున్న మాట ఏంటయా అంటే... సూర్య అనవసరంగా తండ్రి, విలన్ పాత్రలు పోషిస్తూ తనకున్న క్రేజ్ తగ్గించుకుంటున్నారని చెపుతున్నారు. అదే తెలుగులో చిరంజీవి, బాలయ్య తదితర సీనియర్ హీరోలు 60 ఏళ్లు సమీపిస్తున్నా ఇంకా యంగ్ పాత్రల్లో నటిస్తూ మార్కెట్టును పెంచుకుంటుంటే... సూర్య ఇలాంటి పాత్రలు సెలెక్ట్ చేసుకుని చేతులారా క్రేజ్‌ను పోగొట్టుకుంటున్నాడని చెపుతున్నారు. మరి సూర్య తన రూట్ మార్చుకుంటారో లేదో చూద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పద్మావత్ అశ్లీల సినిమా.. అస్సలు చూడొద్దు.. ఓవైసీ అసదుద్ధీన్