Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశ్వరూపం చూపిస్తున్న బాబాయ్... చిన్నబోతున్న అబ్బాయ్.. ఇక బాక్సులు బద్దలేనా?

తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ ప్రతి మూవీకి పెరిగిపోతోంది. నిజానికి గతంలో మంచి చిత్రాలు నిర్మించినా.. క్వాలిటీపరంగా అంత పేరు లేదు. కానీ ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తీస్తున్న చిత్రాలు.. ఇండియన్ ఫి

Advertiesment
Gautamiputra Satakarni Teaser
, ఆదివారం, 18 డిశెంబరు 2016 (17:39 IST)
తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ ప్రతి మూవీకి పెరిగిపోతోంది. నిజానికి గతంలో మంచి చిత్రాలు నిర్మించినా.. క్వాలిటీపరంగా అంత పేరు లేదు. కానీ ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తీస్తున్న చిత్రాలు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫిల్మ్స్‌గా ఖ్యాతిగడిస్తున్నాయి. 
 
ఇదిలావుంటే చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నాయి. చిరంజీవి 'ఖైదీ నంబర్ 150'గా వస్తుంటే బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి'గా రానున్నారు. ఈ రెండు చిత్రాల టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నాయి. దీంతో ఈ సంక్రాంతి తెలగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో ప్రత్యేకమైంది. 
 
అయితే, 'గౌతమిపుత్రశాతకర్ణి' మూవీ థియోట్రికల్ ట్రైలర్‌కి అదిరిపోయే స్పందన వచ్చింది. ఒక్క రోజులోనే ఈ మూవీ 3 మిలియన్ వ్యూస్‌ని అందుకుంది. ఇప్పటివరకు సాధించిన యూట్యూబ్ రికార్డ్స్‌లలో 'గౌతమిపుత్రశాతకర్ణి' మూవీనే టాప్ పొజిషన్‌లో ఉంది. 
 
బాలకృష్ణతో ఇతర హీరోలు నువ్వానేనా అని పోటీ పడుతున్నప్పటికీ... నందమూరి హీరోలు మాత్రం బాగా వెనుకబడి పోతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా.. బాలకృష్ణకు సరైన పోటీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇటీవలి కాలంలో బాగా వెనుకబడి పోయాడు. ఈ హీరో తీసిని పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఇది నందమూరి ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు లోను చేసింది. 
 
అయినప్పటికీ.. బాలకృష్ణ గత కొంతకాలంగా విశ్వరూపం చూపిస్తుంటే.. నందమూరి ఫ్యాన్స్ సైతం తెగ సంబరపడి పోతున్నారు. మొత్తంగా ఇప్పుడు అబ్బాయ్‌ల సినిమా ముచ్చట్లు కంటే బాబాయ్ సాధించిన లేటెస్ట్ రికార్డ్ ఇండస్ట్రీ టాక్స్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పిట్టగోడ' వంటి డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ్యూజిక్ చేయ‌డం హ్యాపీ : ప్రాణం క‌మ‌లాక‌ర్‌