Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

Advertiesment
Mantri Seethakka, Surya Vantipalli. Shashi Vantipalli

డీవీ

, శనివారం, 30 నవంబరు 2024 (15:21 IST)
Mantri Seethakka, Surya Vantipalli. Shashi Vantipalli
మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చిత్రం నారి. ఆమని, వికాస్ వశిష్ఠ,మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు సూర్య వంటిపల్లి.  శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నారి సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క మాట్లాడుతూ - మహిళలు ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నారు. అయినా వారి పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు. సమాజ నిర్మాతలు మహిళల అనే నిజాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఆడ పిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాడు అందించాలి. మహిళల్ని గౌరవించాలి. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ తో నారి సినిమా చేసిన సూర్య వంటిపల్లి కి అభినందనలు. ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ నా చేతుల మీదుగా విడుదల చేసుకోవడం సంతోషంగా ఉంది. నారి సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. మహిళల గురించి వారి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ, ఇటీవల ఓ స్కూల్ అమ్మాయి తన టీచర్ తో అమ్మాయిగా తన కష్టాలు చెబుతూ తాను మగవాడిగా మారాలని అనుకుంటున్నట్లు చెప్పిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఆ సన్నివేశం మా నారి సినిమాలోనిది. ఆ అమ్మాయి నిత్యశ్రీ. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను. డిసెంబర్ 25న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి మహిళ తమ ఇంట్లోని పురుషుడిని వెంట తీసుకెళ్లి ఈ సినిమాను చూపిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటీనటులు - ఆమని, వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ, ఛత్రపతి శేఖర్, నాగ మహేశ్, సునైన, రామచంద్ర, రాజశేఖర్, ఫణి, గీతాకృష్ణ రెడ్డి, ధృవన్ వర్మ, రాజమండ్రి శ్రీదేవి, సత్తన్న, వి. లోకేష్, నాగిరెడ్డి, అచ్యుత రామారావు, శేఖర్ నీలిశెట్టి, లడ్డు, గూడ రామకృష్ణ, భార్గవి, శ్రీవల్లి, సాయి రేణుక, గీత, మహేశ్, వినయ్, అఖిల్ యడవల్లి, తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి