Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోయిన్ లక్‌పై ఆధారపడిన కోలీవుడ్ హీరో... డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్న విక్రమ్

చిత్ర పరిశ్రమలో ఎపుడు విజయం వరిస్తుందో.. ఎపుడు బ్యాట్ టైమ్ స్టార్ట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్న వారిలో కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ఒకరు. గత కొంతకాలంగా సరైన హిట్

Advertiesment
Hot actress Keerthy Suresh
, బుధవారం, 10 మే 2017 (10:52 IST)
చిత్ర పరిశ్రమలో ఎపుడు విజయం వరిస్తుందో.. ఎపుడు బ్యాట్ టైమ్ స్టార్ట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్న వారిలో కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ఒకరు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాగా డిప్రెషన్‌లో ఉన్నారు. దీంతో ఈ సీనియర్ హీరో ఓ హీరోయిన్ లక్‌పై ఆధారపడాలని నిర్ణయించుకున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. కీర్తి సురేష్. మలయాళ భామ. 
 
హ్యాట్రిక్ సక్సెస్‌తో హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఆఫర్స్ వెంటాడుతున్నాయి. కీర్తి సురేష్ జోరు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో మామూలుగా లేదు. యంగ్ హీరోలతోపాటు స్టార్ హీరోలతోనూ వరుసగా ఫిల్మ్ చేసేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించటంతో ఆమెకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
 
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కూడా కీర్తి డేట్స్ కోసం తానే అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. విలక్షణ నటుడిగా నేషనల్ లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్, మాస్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ హరి దర్శకత్వంలో "సామి 2" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కీర్తి బిజీగా ఉండటంతో ఆమె తేదీలకు తగ్గట్టుగా విక్రమ్ తన డేట్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. కొంత కాలంగా తన రేంజ్‌కు తగిన హిట్ ఇవ్వలేకపోవడంతో చివరకు హీరోయిన్ తేదీలకు అనుగుణంగా తన తేదీని అడ్జెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హృతిక్ రోషన్‌-నయనతార- సోనమ్ కపూర్ జక్కన్నకు నో చెప్పారట.. ఇప్పుడు ఏడ్చుకుంటున్నారట!