Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా 'ఇద్దరి మధ్య 18'.. ఆడియో విడుదల

ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో నటించిన, నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చి

Advertiesment
Iddari Madhya 18 Movie Audio Launch
, సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (18:12 IST)
ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో నటించిన, నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం 'ఇద్దరి మధ్య 18'. ఈ చిత్ర బిగ్‌ సీడీని తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు, జీవిత, ఎన్‌. శంకర్‌, మల్కాపురం శివకుమార్‌, చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌, దర్శకుడు నాని ఆచార్య, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ, చిత్ర కథానాయకుడు రాంకార్తీక్‌, బిత్తిరిసత్తి, కెమెరామెన్‌ జి.ఎల్‌. బాబు తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి వర్యులు హరీష్‌రావు మాట్లాడుతూ 'రాజకీయాలలో పేరొందిన శివరాజ్‌ పాటిల్‌ ఈ చిత్రం ద్వారా సినీ రంగంలో కూడా మంచి పేరు పొందాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు. చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. మా చిత్ర ఆడియోని ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ చిత్రాన్ని యూత్‌ని ఆట్టుకునే అంశంతో, ఒక చక్కని మెసేజ్‌తో దర్శకుడు నాని ఆచార్య తెరకెక్కించారు. ఘంటాడి కృష్ణ అందించిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. 
 
ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ..ఇది నా 50వ చిత్రం. సంగీత దర్శకుడిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ నాకు ఈ చిత్రంతో ప్రారంభం అవుతుందని, ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న 'డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్' టీజ‌ర్‌