Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

Advertiesment
Manchu Manoj, Sai madhav burra and team

దేవీ

, గురువారం, 27 నవంబరు 2025 (18:38 IST)
Manchu Manoj, Sai madhav burra and team
అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా వానర. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు సినిమా టీజర్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
 
మంచు మనోజ్ మాట్లాడుతూ, అవినాశ్ గురించి నాకు తెలుసు. చాలా కష్టపడే తత్వం ఉన్నవాడు. ఫస్ట్ సినిమాకే హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. అది అంత సులువు కాదు. ఈ రోజు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బాగున్న ప్రతి సినిమా భాషలకు అతీతంగా ఇండియన్ సినిమా అయ్యింది. అవినాశ్ ఆయన టీమ్ కష్టపడి చేసిన ఈ సినిమా సక్సెస్ కావాలి. అవినాశ్, ఆయన టీమ్ కు మంచి పేరు తీసుకురావాలి. అవినాశ్ ఫాదర్ హనుమంతరావు గారు హీరో కావాలని అనుకున్నారు కానీ పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి వెళ్లారు. ఆయన తన కలను కొడుకు అవినాశ్ ద్వారా నిజం చేసుకున్నారు. ఈ రోజు అవినాశ్ ను చూసి హనుమంతరావు గారు గర్వపడుతున్నారు. సాయం చేసే ప్రతి ఒక్కరి హృదయంలో హనుమ ఉన్నారు. మ్యూజిక్ మీద నాకున్న ఇష్టంతోనే మోహనరాగ మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేశాను. అన్నారు.
 
డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ - పెద్ద సినిమాకు పెట్టాల్సిన టైటిల్ ఇది, ఈ టైటిల్ ఈ సినిమాను పెద్ద రేంజ్ కు తీసుకెళ్తుంది. సినిమా మీద ఎంతో తపనతో యంగ్ టీమ్ చేసిన సినిమా ఇది. అనుభవం ఉన్న నాలాంటి వాళ్లను కూడా ఈ యంగ్ టీమ్ ఇన్స్ పైర్ చేసింది. అవినాశ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. అవినాశ్ కు అన్ని క్రాఫ్ట్ ల మీద పట్టుంది. ఈ సినిమాకు అన్నీ తానై రూపొందించాడు. ఇండస్ట్రీకి "వానర" లాంటి చిత్రాలు అవసరం. ఇలాంటి సినిమాలు ఎన్ని వస్తే ఇండస్ట్రీ అంత బాగుంటుంది. అన్నారు.
 
హీరో, డైరెక్టర్ అవినాశ్ తిరువీధుల మాట్లాడుతూ, యాక్టర్ కావాలనేది మా నాన్న కల. ఈ రోజు ఆ కల తీరింది. నాన్న ఈ  కార్యక్రమంలో పాల్గొని వేదిక మీద నన్ను చూస్తున్నారు. ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం. టీజర్ మీరంతా చూశారు. ఇంత మంచి ఔట్ పుట్ వచ్చిందంటే కారణం మా టీమ్. సాయిమాధవ్ బుర్రా గారు మంచి డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ రాయడంతో పాటు వాటికి ఆర్టిస్టులు ఎలా రియాక్ట్ కావాలో వాయిస్ రికార్డ్ పంపేవారు. దాంతో నాకు షూటింగ్ చేయడం ఈజీ అయ్యింది. వివేక్ సాగర్ గారు ఇచ్చిన మ్యూజిక్ త్వరలో వింటారు. సినిమా కంప్లీట్ అయ్యింది. త్వరలో రిలీజ్ కు తీసుకొస్తాం. సినిమా చూశాక ఇది కొత్త వాళ్లు తీసిన సినిమానా ? అని మీరంతా ఆశ్చర్యపోతారు. వానరుడి లాంటి హీరో తనకు ఇష్టమైన బైక్ ను రావణుడి లాంటి విలన్ తీసుకెళ్లిపోతే ఆ బైక్ ను తిరిగి తెచ్చుకునేందుకు ఎంతవరకు వెళ్లాడు, ఎలాంటి ఫైట్ చేశాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఈ కథ అనేక మలుపులు తిరుగుతూ థ్రిల్ పంచుతుంది. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం