Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్యాణ్ రామ్‌.. ఎంత మంచి వాడవురా.. హీరోయిన్‌గా మెహ్రీన్ (Video)

Advertiesment
Kalyan Ram's new film: Enta ManchivadavuraEntha Manchivaadavuraa
, శుక్రవారం, 5 జులై 2019 (16:24 IST)
నటుడు కళ్యాణ్ రామ్‌లోని ప్రయోగాత్మక కోణం గురించి తెలిసిందే. `ఓం -3డి` లాంటి భారీ బడ్జెట్ సినిమాని నిర్మించి అందులో ప్రయోగాత్మక పాత్రలో కనిపించారు. తన సోదరుడు ఎన్టీఆర్ హీరోగా `జైలవకుశ` లాంటి విభిన్నమైన సినిమాని నిర్మించారు. ఇటీవలే 118 లాంటి నవ్యపంథా సినిమాలో నటనతో మెప్పించారు. కమర్షియల్ సక్సెస్‌తో పాటు వైవిధ్యం కోసం పాకులాడే హీరోగా కళ్యాణ్ రామ్ గుర్తింపు పొందారు. 
 
కాబట్టే అతడు నటిస్తున్న తాజా సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ రామ్ వరుసగా రెండు సినిమాల్లో నటిస్తున్నారు. నేడు బర్త్ డే సంద్భంగా ఈ సినిమాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న 17వ సినిమా టైటిల్‌ని యూనిట్ వర్గాలు ప్రకటించాయి. `ఎంత మంచి వాడవురా` అనేది ఈ సినిమా టైటిల్. ఈ చిత్రానికి సతీష్ వేగేష్న దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణతో `ఆదిత్య 369` లాంటి క్లాసిక్‌ని నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‍మల్లిడి వేణు దర్శకుడిగా కల్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న సినిమాకి రావణ టైటిల్‌ని ఖరారు చేశారని ఇటీవల వార్తలొచ్చాయి. తొలుత ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్‌ని పెట్టాలనుకున్నా చివరికి రావణ అయితే బాగుంటుందని భావిస్తున్నారని ప్రచారమైంది. 118 లాంటి ప్రయోగం తర్వాత కళ్యాణ్ రామ్ కథల విషయంలో కాస్తంత వెరైటీగానే ఆలోచిస్తున్నారని అతడి ఎంపికలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇస్మార్ట్ శంక‌ర్ సెన్సేషన్... పూర్ పూరీకి ఈసారైనా క‌లిసి వ‌చ్చేనా..?