Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగ్గా జాసూస్: టైమ్ దొరుకుతుందో లేదో.. ముందుగానే కత్రీనాతో కేక్ కట్ చేయించిన రణ్ బీర్ (వీడియో)

ఒకప్పుడు బాలీవుడ్ ప్రేమ పక్షులుగా విదేశాల్లో విహరించి.. ఆపై సహజీవనం చేసి.. బ్రేకప్ తీసుకున్న కత్రీనా కైఫ్, రణ్ బీర్ కపూర్ జోడీ ప్రస్తుతం జగ్గా జాసూస్ సినిమాలో జంటగా నటిస్తోంది. ప్రస్తుతం వీరు ఆ సినిమా

Advertiesment
Katrina Kaif
, బుధవారం, 12 జులై 2017 (17:05 IST)
ఒకప్పుడు బాలీవుడ్ ప్రేమ పక్షులుగా విదేశాల్లో విహరించి.. ఆపై సహజీవనం చేసి.. బ్రేకప్ తీసుకున్న కత్రీనా కైఫ్, రణ్ బీర్ కపూర్ జోడీ ప్రస్తుతం జగ్గా జాసూస్ సినిమాలో జంటగా నటిస్తోంది. ప్రస్తుతం వీరు ఆ సినిమా ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ పుట్టిన రోజుకు ముందుగానే ఆమెతో మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ కేక్ కోయించేశాడు.
 
జూలై 16న కత్రినా కైఫ్ పుట్టిన రోజు కావడంతో ముందుగానే రణబీర్ మంచి చాక్లెట్ కేక్ తెప్పించేశాడు. హ్యాపీ బర్త్ డే అంటూ రణబీర్ పల్లవి అందుకోగా, కత్రినా కైఫ్ ఉత్సాహంగా ఊగిపోతూ కేక్ కోసింది. ఈ  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఇదిలా ఉంటే... తెలియని పనిలో చేయి పెట్టనని కత్రినా కైఫ్ జగ్గా జాసూస్ ప్రచార కార్యక్రమంలో వెల్లడించింది. జగ్గా జాసూస్ సినిమా నటించేందుకు ముందు చాలా టైమ్ తీసుకున్న ఈ భామ.. సినిమా నిర్మాణ సమయంలోనే, తనకు నిర్మాత కష్టాలేంటో తెలిసొచ్చాయని కత్రినాకైఫ్‌ చెప్పుకొచ్చింది. 
 
చెల్లెలి కోసం కత్రినా నిర్మాతగా మారబోతోందంటూ ఊహాగానాలు విన్పిస్తున్న వేళ, అవన్నీ రూమర్లేనని చెప్పింది. ఇంకా నిర్మాణ సారథ్యం వహించడం అంటేనే కత్రినా కైఫ్ బెదిరిపోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ బిగ్‌బాస్ షోపై ఫిర్యాదు.. 75శాతం నగ్నంగా నటిస్తున్నారు.. కమల్‌తో పాటు వారిని?