Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇళయరాజా తో ఏదోజన్మలో పరిచయం.. అంటున్న కీరవాణి

Advertiesment
Keeravani, Ilayaraja and others

డీవీ

, గురువారం, 2 జనవరి 2025 (09:50 IST)
Keeravani, Ilayaraja and others
'ఏదో... ఏ జన్మలోదో... ఈ పరిచయం' అంటూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రాసిన పాటకు ఇళయరాజా సంగీతం ప్రత్యేకసంతరించుకుంది. రూపేష్ కథానాయకుడిగా మా ఆయి (MAA AAI)  ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా 'షష్టిపూర్తి'. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, జాతీయ ఉత్తమ నటి  అర్చన ఇందులో ప్రధాన తారాగణం.

క్లాసిక్ ఫిల్మ్ 'లేడీస్ టైలర్' విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్  సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలోని 'ఏదో ఏ జన్మ లోదో' సాంగ్ త్వరలో విడుదల చేయనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు.  
 
చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ''మా సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. చైతన్య ప్రసాద్ గారు కొన్ని పాటలకు సాహిత్యం అందించారు. ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే ఓ పాటకు కీరవాణి గారు అయితే బావుంటుందని అనిపించింది. చైతన్య ప్రసాద్ గారికి కీరవాణి గారు క్లోజ్. ఆయన ద్వారా అప్రోచ్ అయ్యాము. లక్కీగా ఆ టైంలో కీరవాణి గారు చెన్నైలో ఉన్నారు. లంచ్ టైంలో వెళ్లి కలిశాము. సిట్యువేషన్ చెప్పి సాంగ్ రాయమని రిక్వెస్ట్ చేయగా,  ఓకే అన్నారు. మేం స్టూడియో‌కు తిరిగి వచ్చేసరికి పల్లవి రాసి పంపించారు. ఆ రోజే చరణం, తర్వాత రోజు మరో చరణం రాసి ఇచ్చారు. ఇళయరాజా గారి బాణీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు సాహిత్యం అందించడం, అది మా సినిమాలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ఇది మా చిత్ర బృందం చేసుకున్న అదృష్టం. కీరవాణి గారు ఇప్పటివరకూ 60 పై చిలుకు పాటలు రాశారు కానీ , ఇళయరాజా గారి బాణీ కి రాయడం ఇదే ప్రథమం. అది కూడా కీరవాణి గారు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రాయడం ఇంకా విశేషం  '' అని అన్నారు.
 
సినిమా హీరో, నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ''ఇళయరాజా సంగీతం, కీరవాణి సాహిత్యంతో కూడిన పాట మా సినిమాలో ఉండటం కంటే ఇంకేం కావాలి? ఈ అవకాశం హీరోగా, నిర్మాతగా నాకు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఈ పాట అందరికీ నచ్చుతుంది. మిగతా పాటలూ బాగా వచ్చాయి. కుటుంబ బంధాలు, విలువల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. రాజేంద్ర ప్రసాద్, అర్చన వంటి సీనియర్ హీరో హీరోయిన్లతో నటించడం నాకొక లెర్నింగ్ ప్రాసెస్ అండ్ బ్లెస్సింగ్. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు. 
 
రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్,  'కాంతార' ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, 'చలాకి' చంటి, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి , రుహీనా, రామ్మోహన్ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైవిధ్యమైన పాత్రలో రామ్ పోతినేని - మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే‌