Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు బిగ్ బాస్ ఓన్లీ రేటింగ్ కోసమే.. ఆపేయండి.. కేతిరెడ్డి పిల్

Advertiesment
Kethireddy Jagadishwar Reddy
, బుధవారం, 17 జులై 2019 (13:05 IST)
తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులపై యాంకర్ శ్వేతా రెడ్డి, సినీ నటి గాయత్రి గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఈ నెల 21 నుంచి స్టార్ మాలో ప్రసారం కానున్న ఈ షోకు అంతరాయం ఏర్పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ కార్యక్రమం అనైతికంగా వుందని.. దీన్ని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
అనైతిక చర్యలు, అసాంఘిక చర్యలతో జనజీవనాన్ని తప్పుదారి పట్టించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు వస్తుందంటూ నటులను ఆకర్షిస్తారన్నారు. అక్కడ పాల్గొనే వారిలో కుట్రలు చేసేలా రెచ్చగొడుతూ.. సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ రేటింగ్ పెంచేసుకుంటున్నారని.. కేతిరెడ్డి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
దీనివల్ల బాధితులు ఎప్పుడోగానీ బయటికి రారన్నారు. ఇప్పటికే దీనిపై బంజారాహిల్స్‌, రాయదుర్గం పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈనెల 21న ప్రారంభమయ్యే బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
 
ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, కమిషనర్‌, కలెక్టర్‌, ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ బోర్డు, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (మా టీవీ), ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఫౌండేషన్‌, ఎండెమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ లిమిటెడ్‌లను చేర్చారు.
 
తనపై బంజారాహిల్స్‌, రాయ్‌దుర్గం పోలీసు స్టేషన్‌లలో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ బిగ్‌బాస్‌ కార్యక్రమం నిర్వాహకుడు అభిషేక్‌ ముఖర్జీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తప్పుడు కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ 3కి ఓకే చెప్పి తప్పు చేశానా అని నాగ్ మథనపడుతున్నారా? ఎందుకు?