Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 4న కిరణ్‌ అబ్బవరం సెబాస్టియన్‌ పిసి524

Advertiesment
Kiran Abbavaram
, సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (16:14 IST)
Sebastian PC 524
‘రాజావారు రాణిగారు’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన కిరణ్‌ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ ఓపేరు తెచ్చుకున్నారు. తన రెండో చిత్రం ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’తో కూడా మరో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్నారు. క్లాసు-మాసు, యూత్‌- ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మార్చి 4న ‘సెబాస్టియన్‌ పిసి 524’తో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకోవడానికి రెడీ అవుతున్నారు.  
 
జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా, సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలుగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది.
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం’ చిత్రాల విజయంతో దూసుకుపోతున్న కిరణ్‌ అబ్బవరపుకు మా ‘సెబాస్టియన్‌ పిసి524’ ఖచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ ఇస్తుంది. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి.ముఖ్యంగా "హెలి"అనే పాటకు మేము అస్సలు ఊహించలేనటువంటి రెస్పాన్స్ ప్రేక్షకులనుండి లభించింది.ఇటీవలే విడుదలైన గ్లిమ్స్ కూడా సూపర్ ట్రెండింగ్ లో ఉంది. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం. మార్చి 4వ తేదీన ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు అన్నారు.
 
కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దారేకర్‌), శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ రఘువరన్‌, ఆదర్ష్‌ బాలకృష్ణ, జార్జ్‌, సూర్య, మహేష్‌ విట్టా, రవితేజ, రాజ్‌ విక్రమ్‌, లత, ఇషాన్‌, రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
 
ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడు`ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైన్‌: చవన్‌ ప్రసాద్‌, స్టిల్స్‌: కుందన్‌ - శివ, సౌండ్‌: సింక్‌ సినిమాస్‌ సచిన్‌ సుధాకరన్‌, కాస్ట్యూమ్స్‌: రెబెకా - అయేషా మరియమ్‌, ఫైట్స్‌: అంజి మాస్టర్‌, సిజి: వీర, డీఐ: రాజు, కూర్పు: విప్లవ్‌ న్యసదాం, కళ: కిరణ్‌ మామిడి, ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కె.ఎల్‌. మదన్‌, సమర్పణ: ఎలైట్‌ ఎంటర్టైన్మెంట్స్‌, నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్‌, సంగీతం: జిబ్రాన్‌, నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్‌, రాజు, కథ - దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుణ శేఖ‌ర్ విజువ‌ల్ వండ‌ర్ శాకుంత‌లం ఫ‌స్ట్ లుక్